iDreamPost
android-app
ios-app

వీరమల్లు అసుర హననం మెప్పించినట్లేనా !

  • Published May 21, 2025 | 1:33 PM Updated Updated May 21, 2025 | 3:02 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు గురించి ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక కంటెంట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు గురించి ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక కంటెంట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

  • Published May 21, 2025 | 1:33 PMUpdated May 21, 2025 | 3:02 PM
వీరమల్లు అసుర హననం మెప్పించినట్లేనా !

హరి హర వీరమల్లు నుంచి ఓ ఇంపార్టెంట్ సాంగ్ రిలీజ్ అయింది. అదే అసుర హననం పాట. ఈ సాంగ్ రిలీజ్ కు ముందు దీని గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. దీనితో ఈ సాంగ్ మీద విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ తర్వాత సరిగ్గా చెప్పినట్లుగానే అంచనాలను అందుకుంది అంతా అంటున్నారు. మొఘలుల మీద తిరుగుబాటు ప్రకటించిన వీరమల్లు పరాక్రమం ఏ రేంజ్ ప్రజలను ఉత్తేజ పరుస్తుంది అనే సందర్భంలో ఈ సాంగ్ ను పెట్టారు.

గతంలో పవన్ కళ్యాణ్ ఓసారి.. తనకు పౌరుషం తగ్గినప్పుడల్లా ఈ సాంగ్ ను వింటూ ఉంటానని చెప్పినట్టే.. కీరవాణి చాలా పవర్ ఫుల్ సౌండింగ్ తో దీనికి బాణీ కుదిర్చారు. ఇక సాంగ్ లో చూపించిన విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క షాట్ లో మాత్రం బాబీ డియోల్ లో చూపించారు. ఇక మిగిలిన ఏ ఆర్టిస్ట్స్ ను సాంగ్ లో రివీల్ చేయలేదు. గతంలో వచ్చిన సాంగ్స్ కంటే కూడా ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూసినట్లయితే మొత్తానికి జూన్ 12 న థియేటర్స్ లో ఈ సినిమా గట్టిగ సౌండ్ చేసేలా ఉంది. రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. త్వరలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తులో ప్లాన్ చేయనున్నారు. మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.