iDreamPost
android-app
ios-app

త్రివిక్రమ్ చేతిలో చరణ్ నెక్స్ట్ మూవీ !

  • Published May 28, 2025 | 1:39 PM Updated Updated May 28, 2025 | 1:39 PM

టాలీవుడ్ లో ఊహించని కాంబినేషన్స్ తెరమీదకు వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాకపోయినా కూడా. తెర వెనుక ఏమి జరుగుతుందో ఓ కంట కనిపెడుతూనే ఉంటారు సినీ లవర్స్ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు.

టాలీవుడ్ లో ఊహించని కాంబినేషన్స్ తెరమీదకు వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాకపోయినా కూడా. తెర వెనుక ఏమి జరుగుతుందో ఓ కంట కనిపెడుతూనే ఉంటారు సినీ లవర్స్ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు.

  • Published May 28, 2025 | 1:39 PMUpdated May 28, 2025 | 1:39 PM
త్రివిక్రమ్ చేతిలో చరణ్ నెక్స్ట్ మూవీ !

టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శకులు ఎప్పుడు ఓ షాక్ ను ఇస్తూనే ఉంటారు. ఊహించని కాంబినేషన్స్ తెరమీదకు వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాకపోయినా కూడా. తెర వెనుక ఏమి జరుగుతుందో ఓ కంట కనిపెడుతూనే ఉంటారు సినీ లవర్స్ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చరణ్ కాంబోలో ఓ మూవీ ఉండబోతుందని అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు త్రివిక్రమ్ వెంకటేష్ తో ఒక సినిమా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది దీనిని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. దీనికి సంబందించిన డీటెయిల్స్ జూన్ 6న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఓ వైపు చరణ్ పెద్ది మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా టాక్స్ లో ఉంది. కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టేలా ఉందట. ఈలోగా త్రివిక్రమ్ చరణ్ కాంబోని కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్లు హాసిని సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సో పెద్ది తర్వాత చరణ్ మూవీ RC 17 అవుతుందా RC 18 అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. చరణ్ కోసం మాత్రం త్రివిక్రమ్ దగ్గర ఓ స్టోరీ రెడీగా ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ దుబాయ్ లో ఉన్నాడు. సుకుమార్ స్క్రిప్ట్స్ తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని అంటున్నారు. సో ప్రస్తుతం రామ్ చరణ్ స్పీడ్ పెంచే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. పెద్ది సినిమాను నవంబర్ లోగా కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ స్క్రిప్ట్స్ లో ఒకటి ఒకే చేసే అవకాశం ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.