వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య కామెడీ, కథ, కథనం, ప్లస్-మైనస్లతో పూర్తి రివ్యూ.
వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య కామెడీ, కథ, కథనం, ప్లస్-మైనస్లతో పూర్తి రివ్యూ.
Chiranjeevi
కొరియన్ కనకరాజు – చాలా క్యాప్ వచ్చింది మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా థియేటర్లో చూసి. కాస్త ప్రామిసింగ్ ప్రచారంతో ఈవారం విడుదలైంది కొరియన్ కనకరాజు. యువి సంస్థ నిర్మాణం. మేర్లపాక గాంధీ దర్శకత్వం. కామెడీ హర్రర్ జానర్. అందువల్ల అన్ని విధాలుగా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది ఈ సినిమా. ఎందుకు..ఏమిటి..ఎలా అన్నది చూసే ముందు కథ ఏమిటన్నది చూద్దాం.
అనంతపురంలో ఓ మాస్ క్యారక్టర్ కనకరాజు (వరుణ్ తేజ్). కియా మోటార్స్ లో పనిచేసే అమ్మాయి (రితిక నాయక్) తో ప్రేమలో పడతాడు. కొరియాలో ఓ మాఫియా డాన్ చనిపోతే, అతని అస్తికలు వుంచిన చిత్రమైన సీసా అలా అలా అనంతపురం చెరువులో చేరుతుంది. అది కాస్తా అక్కడి నుంచి చేతులు మారి బార్ లో డెకరేటివ్ వస్తువుగా మారుతుంది. అనుకోకుండా అందులో మద్యం పోసుకుని, అస్తికలతో కలిపి మరీ తాగేస్తాడు కనకరాజు. దాంతో ఆ కొరియన్ డాన్ ఆత్మ కనకరాజును ఆవహిస్తుంది. దాంతో కథ కొరియాకు మారుతుంది. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
దెయ్యాల సినిమాలకు లాజిక్కులు వుండవు. వుండాల్సిన పని లేదు. అలా అని మరీ అడ్డగోలుగా సీన్లు అల్లేసి సినిమా తీయకూడదు కదా. కనకరాజు సినిమాకు తొలి సమస్య. కొరియన్ దెయ్యం అనే ఒకే ఒక్క కొత్త పాయింట్ తప్ప మరే విధంగానూ కొత్తగా వుండకపోవడం, ఓ మాస్ హీరో పాత్ర, ఒక అమ్మాయి వెంట ప్రేమ అంటూ పడడం, సిల్లీ వేషాలు వేయడం, దహనసంస్కారాలు అనేది లేని కొరియన్ డాన్ ను దహనం చేసి, ఆ అస్తికలు ఓ సీసాలో వేయడం ఏమిటో.
సినిమా తొలిసగం చాలా ఆలస్యంగా అసలు కథలోకి ఎంట్రీ ఇస్తుంది. అంతవరకు జరిగే మాస్ రొటీన్ సీన్లు కానీ, లవ్ ట్రాక్ కానీ ఏమంత ఆకట్టుకోవు. వన్స్ అసలు కథలోకి ఎంటర్ అయిన తరవాత కాస్త ఆసక్తి కలుగుతుంది. కొరియన్ ఆత్మ కావడంతో ఆ భాషను చాలా ఎక్కువగా వాడడం అన్నది కాస్త పంటి కింద రాయిలా వుంటుంది. ఓ డిక్లయిమర్ వేసేసి తెలుగులో మాట్లాడించేసినా, తెలుగు సబ్ టైటిల్స్ వేసినా వేరుగా వుండేదేమో? సత్య కామెడీ, వరుణ్ రాయలసీమ యాక్సెంట్ తప్ప తొలిసగంలో చెప్పుకోదగ్గది ఏమీ వుండదు.
మలి సగంలో సినిమా అంతా కొరియాలోనే జరుగుతుంది. అక్కడి నుంచి కథ పగ్గాలు తెంచుకున్న గుర్రంగా వెళ్లిపోతుంది. ఆత్మ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కాసేపు ఇలా కాసేపు అలా నడిచే సినిమా సీన్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. అదే సమస్య. ఇలాంటి గడబిడలో కూడా సత్య చేసే కామెడీ సినిమాను ఆదుకుంటుంది. ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ కూడా రంజింపచేయలేకపోయాయి. అనవసరపు ఖర్చులకు పోయి, ఆత్మ పరమాత్మల ఫైట్ అంటూ ఏదేదో చేసారు. అవన్నీ అద్భుతాలు చేస్తాయని దర్శకుడు భ్రమపడినట్లున్నాడు. కానీ అలా జరగలేదు. పైగా ఫన్ జానర్ అన్నపుడు మన నేటివిటీ ఫన్ ను పండించాలి. కానీ అన్ని కొరియన్ ఫేస్ ల మధ్య పండించలేకపోయారు. ఒక విధంగా పూర్ రైటింగ్ అనుకోవచ్చు.
నటనల పరంగా చూసుకుంటే హీరో వరుణ్ తేజ్ రెండు మూడు గెటప్ లతో డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నించారు. మాస్ క్యారెక్టర్ వరకు అతని ప్రయత్నం బాగుంది. హీరోయిన్ రితిక నాయక్ పాత్ర కానీ, నటన కానీ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సత్య మాత్రం స్టీల్ ది షో. కనిపించిన ప్రతి సారీ నవ్వించడానికి ప్రయత్నించాడు. డైలాగ్ లతో లేదా ఎక్స్ ప్రెషన్స్ తో. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మిగిలిన వారు ఒకె. అవసరాల పాత్ర ఏమిటో, ఆ ముడి ఏమిటో, అవన్నీ చాప్ చేసేసినా ఏం తేడా రాదు. ఆ ఎమోషన్ సీన్లు అన్నీ ఫోర్స్ డ్ గా వున్నాయి.
సాంకేతికంగా ఖర్చు కనిపించింది తప్ప కొత్తగా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ కానీ, నేపథ్య సంగీతం కానీ. ఎడిటర్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలా సీన్లు లేచిపోతాయేమో? మొత్తం మీద చూసుకుంటే కమెడియన్ సత్య కామెడీ కోసం ఓ లుక్ వేయచ్చు. లేదంటే వెయిట్ చేయచ్చు.