కరోనా లాక్ డౌన్ల వల్ల ఓటిటి బూమ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెంకటేష్, నాని, సూర్య, నితిన్ లాంటి స్టార్ హీరోలు సైతం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఓకే చెప్పక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి, అందరూ థియేటర్లకు వస్తున్న తరుణంలో ఒమిక్రాన్ రూపంలో వైరస్ మళ్ళీ తిరగబడింది. ఇప్పుడు చాలా చోట్ల యాభై శాతం ఆక్యుపెన్సీలు నడుస్తున్నాయి. వీటిని రేపో మాపో సడలిస్తారు కానీ హాలు దాకా సినిమా చూసేందుకు […]
ఎప్పుడో 22 ఏళ్ళ క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని కాంపౌండ్ నుంచి ప్రేమకథ ద్వారా సుమంత్ పరిచయమైనప్పుడు అతని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అది విజయం సాధించలేదు కానీ తర్వాత వచ్చిన యువకుడు మంచి పేరు తీసుకురాగా సత్యం సూపర్ హిట్ ఒక స్థానాన్ని ఇచ్చింది. ఇప్పటికీ గోదావరి టీవీలో వస్తే చూసే ప్రేక్షకులు చాలానే ఉన్నారు. గౌరీ, మహానంది లాంటి సినిమాలు బిసి సెంటర్లలో నిర్మాతలకు లాభాలు ఇచ్చినవే. ఒకప్పుడు ఫస్ట్ […]
ఏదో పింక్ రీమేక్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ఒకటో రెండో సినిమాలు చేసి మళ్ళీ జనసేనలో బిజీ అవుతాడేమో అనుకున్నారందరూ. కానీ దానికి విరుద్ధంగా ఒకేవారంలో రెండు షూటింగ్ ప్రారంభాలు, ఒక అనౌన్స్ మెంట్ రావడం అనేది అభిమానులు సైతం ఊహించనిది. ముఖ్యంగా నిన్న గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబో అనౌన్స్ చేయడం సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. ఇంకో ఇండస్ట్రీ హిట్ కు దారులు పడ్డాయని అప్పుడే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. […]
https://youtu.be/PBqjjkULbDo,c3nwyaO2G9I