iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కన్నా ముందు దుల్కర్

  • Published Mar 18, 2020 | 4:47 PM Updated Updated Mar 18, 2020 | 4:47 PM
  • Published Mar 18, 2020 | 4:47 PMUpdated Mar 18, 2020 | 4:47 PM
ప్రభాస్ కన్నా ముందు దుల్కర్

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ దీని తర్వాత మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే . ఈ ఏడాది డిసెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా దీనికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ లోగా ఇంకో మీడియం రేంజ్ బడ్జెట్ ప్రాజెక్ట్ వైజయంతి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఇది రూపొందే ఛాన్స్ ఉన్నట్టుగా వినికిడి.

మహానటిలో నటిస్తున్న టైంలోనే ఒక తెలుగు స్ట్రెయిట్ మూవీ చేస్తానని దత్తు గారికి దుల్కర్ మాటిచ్చాడట. అందులో భాగంగానే దీనికి కమిటైనట్టు తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఒకవేళ కరోనా గోల లేకపోతే ఉగాదికి అనౌన్స్ మెంట్ వచ్చేదని అంటున్నారు. సో వచ్చే నెల దాకా అధికారిక ప్రకటన ఉండకపోవచ్చు.

హను రాఘవపూడి ప్రస్తుతం బ్యాడ్ ఫాంలో ఉన్నాడు. గత చిత్రం పడి పడి లేచే మనసు ఘోరమైన ఫలితాన్ని అందుకున్న నేపధ్యంలో కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే హను చెప్పిన స్టొరీ బాగా నచ్చడంతోనే ట్రాక్ రికార్డుని పట్టించుకోకుండా దత్తు గారు ఓకే చేసినట్టుగా న్యూస్.

దుల్కర్ కు మహానటి తర్వాత కనులు కనులను దోచాయంటే మంచి జోష్ ఇచ్చింది. మొదట్లో వీక్ ఓపెనింగ్ వచ్చినా తర్వాత మౌత్ టాక్ తో అనూహ్యంగా కలెక్షన్లను పెంచుకుంది. అంతా బాగుందనుకుంటున్న టైంలో కోవిడ్ 19 దెబ్బకు తెలంగాణలో థియేటర్లు మూతబడిపోయి ఫైనల్ రన్ ముగించేసింది. ఏపీలోనూ బాగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు హనుతో చేయబోయే సినిమాను తెలుగు, తమిళ్ లో బై లింగ్వల్ గా తీస్తారట. మలయాళంలో మాత్రం డబ్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే నెలలో వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetgrandpashabetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş