iDreamPost
iDreamPost
మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ లో మొదటిది రాధే శ్యామ్ నిన్న విడుదలైపోయింది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ ఫైనల్ గా పెద్దగా అద్భుతాలేమీ జరగకపోవచ్చు. ఆశించిన స్థాయిలో దర్శకుడు రాధా కృష్ణ అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయారనే కామెంట్స్ మాత్రం గట్టిగా వినపడుతున్నాయి. మొదటి రోజు వసూళ్లకు సంబంధించి ఇంకా లెక్కలు రావాల్సి ఉంది. ఊహించని విధంగా నార్త్ బెల్ట్ లో ఓపెనింగ్ వీక్ గా ఉండటం ట్రేడ్ ని టెన్షన్ పెడుతోంది. దానికి తోడు రెస్పాన్స్ కూడా ఏమంత లేకపోవడంతో కనీసం సాహోనైనా టచ్ చేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సోమవారం నుంచి ట్రెండ్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది.
అసలు విషయానికి వస్తే ఇప్పుడీ పరిణామం వల్ల అనుకున్న టైం కన్నా ముందుగానే జనం దృష్టి ఆర్ఆర్ఆర్ పైకి వెళ్తోంది. 14న విడుదల చేయబోయే ఎత్తర జెండా తాలూకు పోస్టర్ చూసి అభిమానులు మాములు హ్యాపీగా లేరు. నాటు నాటు రేంజ్ లో ఇది మరో ఛార్ట్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు. రిలీజ్ డేట్ 25 అయినప్పటికీ ముందు రోజు రాత్రే పెయిడ్ ప్రీమియర్లు వేసే విధంగా ప్లానింగ్ జరుగుతోందట. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని ఫిలిం నగర్ టాక్. అదే జరిగితే బాహుబలి స్థాయి కాన్ఫిడెన్స్ మళ్ళీ రాజమౌళిలో ఉన్నట్టే. నిజానికి అంతకు మించే అనే రీతిలో ట్రిపులార్ కు పాజిటివ్ వైబ్రేషన్స్ చాలానే కనిపిస్తున్నాయి.
ఆ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ హిందీలోనూ లేవు కాబట్టి మినిమమ్ పాజిటివ్ టాక్ వచ్చినా చాలు ఆర్ఆర్ఆర్ ఊచకోత మాములుగా ఉండదు. రాధే శ్యామ్ లాగా ఇది లవ్ స్టోరీ కాదు. మాస్ ని విపరీతంగా ఆకట్టుకునే కమర్షియల్ అంశాలను జక్కన్న ఫుల్ గా దట్టించారు. నేపధ్యం స్వతంత్ర సమర పోరాటమే అయినా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ని ఏ స్థాయిలో చూపించాలో అంతకంటే ఎక్కువే ఉంటుందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. దుబాయ్, బెంగళూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కన్ఫర్మ్ కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చేస్తారనే దాని మీద ఇంకా ఎలాంటి లీక్స్ రాలేదు హైదరాబాద్ లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
Also Read : Clap Report : క్లాప్ రిపోర్ట్