iDreamPost
iDreamPost
థియేటర్లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ముందే అర్థం చేసుకుంటున్న కొందరు నిర్మాతలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు వెళ్లిపోవడం లాభాలతో పాటు రీచ్ పరంగా మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతిదీ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేయదనే వాస్తవాన్ని గ్రహించి అందుకు తగ్గట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వచ్చిందే క్లాప్. ఆది పినిశెట్టి హీరోగా ఆకాంక్ష సింగ్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు ఉన్న స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాకు ఇళయరాజా సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణ. ట్రైలర్ అంతో ఇంతో విషయం ఉన్నట్టే అనిపించింది. నిన్నటి నుంచి సోనీ లైవ్ లో అందుబాటులోకి వచ్చిన క్లాప్ రిపోర్ట్ చూద్దాం.
తండ్రి(ప్రకాష్ రాజ్) ప్రోత్సాహంతో అథ్లెట్ గా శిక్షణ పొందిన విష్ణు జాతీయ క్రీడలకు సిద్ధమవుతున్న టైంలో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగి నాన్నతో పాటు తన కుడి కాలుని పోగొట్టుకుంటాడు. దీంతో నిరాశలో కూరుకుపోతాడు. అదే సమయంలో కన్నవాళ్లను కోల్పోయి గొప్ప ప్రతిభతో అవకాశాల కోసం చూస్తున్న ఓ లేడీ అథ్లెట్ భాగ్యలక్ష్మి (కృష్ణ కురూప్) గురించి తెలుస్తుంది. తన లక్ష్యాన్ని ఆ అమ్మాయి ద్వారా సాధించాలని నిర్ణయించుకుంటాడు. అసలు వీళిద్దరికి లింక్ ఎలా కుదిరింది, టాలెంట్ ఉన్నప్పటికీ భాగ్యలక్ష్మికి అడ్డుపడిన వారెవరు, ఎలా అధిగమించి గమ్యం చేరుకుందనేదే స్మార్ట్ స్క్రీన్ పై చూడాల్సిన బాలన్స్ స్టోరీ.
ఒకే ఫార్ములాతో పదే పదే వస్తున్న స్పోర్ట్స్ డ్రామాల కోవలోకే క్లాప్ కూడా చేరుతుంది. ఏ మాత్రం ఎగ్జైటింగ్ గా లేని లైన్ కు దర్శకుడు పృథ్వి ఆదిత్య నీరసమైన స్క్రీన్ ప్లే సెట్ చేసుకోవడంతో ఇటు ఎమోషనల్ గానూ అటు ఎంటర్ టైనింగ్ గానూ మెప్పించలేక చతికిల పడింది. ఆది పినిశెట్టి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా వృధా అయ్యింది. విపరీతమైన ల్యాగ్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఇటీవలే వచ్చిన లక్ష్య, గుడ్ లక్ సఖి కోవలోకే క్లాప్ కూడా చేరుతుంది. ఇళయరాజా గమనం, సన్ అఫ్ ఇండియా తర్వాత మరోసారి నిరాశపరిచారు. ఇంట్లోనే చూసే క్యాటగిరీ కాబట్టి ఆది పినిశెట్టి కోసం ఓ ట్రై ఇవ్వడం తప్ప ఇంకే కారణం క్లాప్ కి ఓటెయ్యడానికి ఛాన్స్ ఇవ్వలేదు
Also Read : Maaran Report : మారన్ రిపోర్ట్