iDreamPost
iDreamPost
గత నెల 25న విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన భీమ్లా నాయక్ నెమ్మదించాడు. గత రెండు మూడు రోజులుగా చాలా కేంద్రాల్లో కలెక్షన్ల తగ్గుదల కనిపిస్తోంది. ఇంకో పాతిక కోట్లు షేర్ రావాల్సిన తరుణంలో ఇప్పుడీ వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. నిన్న విడుదలైన కొత్త సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో జనాల ఛాయస్ మళ్ళీ భీమ్లా ఒకటే కాబోతోంది. ఎలాగూ 10న సూర్య ఈటి, 11న రాధే శ్యామ్ వస్తాయి కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకుని గట్టెక్కాలి. ఒకవేళ బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేకపోతే మాత్రం బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేసుకున్నది కాస్తా యావరేజ్ కి పడిపోతుంది. సో ఇప్పుడు రాబోయే వసూళ్ల లెక్కలు కీలకంగా మారనున్నాయి.
ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ ఓటిటి ప్రీమియర్ కి డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. మార్చి 25 లేదా 26న ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. డిస్నీ హాట్ స్టార్ కూడా హక్కులు సొంతం చేసుకుందనే వార్తలు వచ్చాయి కానీ రెండిట్లో ఒకేసారి వస్తుందా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే కేవలం నెల లోపే టెలికాస్ట్ చేసుకున్న రికార్డు భీమ్లా నాయక్ కు దక్కుతుంది. గత ఏడాది వకీల్ సాబ్ సైతం నాలుగు వారాలు దాటకుండానే ప్రైమ్ లోకి తెచ్చేశారు. కాకపోతే అప్పుడు కరోనా కారణంగా ఉంది ఇప్పుడు ఇతరత్రా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
నిజానికి భీమ్లా నాయక్ ఫైనల్ రన్ మార్చి ఇరవై కంటే ముందే వచ్చేస్తుంది. ఈటి, రాధే శ్యామ్ తర్వాత 17న పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ వస్తుంది. అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే కూడా షెడ్యూల్ చేశారు. 18న రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ తెస్తున్నారు. ఇక అన్నిటిని మించి 25న ఆర్ఆర్ఆర్ రిలీజవుతుంది. అప్పటిదాకా భీమ్లా నాయక్ స్ట్రాంగ్ గా ఉండటం అసాధ్యం. సో పైన చెప్పిన డేట్ కరెక్ట్ టైం అనే చెప్పాలి. లేటెస్ట్ గా ఆహా చేస్తున్న ప్రమోషన్లలో చివరి వారం పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ ఉంటుందని హింట్ ఇవ్వడం చూస్తే అది భీమ్లా నాయక్ గురించేనని ఈజీగా అర్థమైపోతుందిగా. అఫీషియల్ గా చెప్పడం ఒకటే లాంఛనమేమో. చూద్దాం
Also Read : Radhe Shyam : ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ వైపే