iDreamPost
android-app
ios-app

Radhe Shyam : ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ వైపే

  • Published Mar 05, 2022 | 3:11 PM Updated Updated Mar 05, 2022 | 3:12 PM
Radhe Shyam : ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ వైపే

కేవలం ఆరే రోజుల్లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదల కాబోతోంది. కొత్త ట్రైలర్ వచ్చాక అంచనాల లెక్కల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. హాలీవుడ్ మూవీస్ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇది రూపొందినట్టు నిన్న వదిలిన మేకింగ్ వీడియోలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ప్యూర్ క్లాస్ మూవీ అని ముందు నుంచి అనుమాన పడుతున్న అభిమానుల సంశయాన్ని తీరుస్తూ ఇదో కంప్లీట్ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అనే నమ్మకాన్ని కలిగించింది. మరోవైపు ప్రభాస్ పూజా హెగ్డేలు తమ డేట్లు కాల్ షీట్లు అన్నీ ఈ వారం మొత్తం రాధే శ్యామ్ ప్రమోషన్లకే కేటాయించారు. ఇంటర్వ్యూలు ఈవెంట్లు వరసబట్టి ప్లాన్ చేసుకుని అటెండ్ అవుతున్నారు.

పబ్లిసిటీ విషయంలో ఆర్ఆర్ఆర్ రేంజ్ దూకుడు రాధే శ్యామ్ చూపించడం లేదన్న కంప్లయింట్ ని సీరియస్ గా తీసుకున్న యువి బృందం దానికి తగ్గట్టే గేరు మార్చేసింది. బాహుబలిని మించే ఓపెనింగ్ ని ఆశిస్తున్న ఫ్యాన్స్ ప్రీమియర్ షో సంబరాలకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఓవర్సీస్ బుకింగ్స్ జోరుమీదున్నాయి. రాధే శ్యామ్ వచ్చే దాకా సైలెంట్ గా ఉండాలని రాజమౌళి నిర్ణయించుకోవడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ సినిమా గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగడం ఖాయం. సాహో గాయాన్ని ఇది మాన్పుతుందని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే థియేటర్ల అలాట్మెంట్లు జరిగిపోయాయి. ఎల్లుండి ఏపిలో జిఓ వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ తర్వాతే అక్కడి స్క్రీన్లు ఫైనల్ కావొచ్చు. ఇదంతా ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 శాతం పైగా రాధే శ్యామ్ స్క్రీనింగ్ జరగబోతోంది. భీమ్లా నాయక్ తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు కొన్ని హోల్డ్ చేసుకున్నప్పటికీ డార్లింగ్ హవా ముందు అవి ఏ మేరకు నిలబడతాయన్నది అనుమానమే. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యూరోప్ లవ్ స్టోరీకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రెండు వారాల గ్యాప్ తో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తుంది కాబట్టి ఆలోగా రాధే శ్యామ్ ఎన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేస్తాడో చూడాలి

Also Read : Sebastian Report :సెబాస్టియన్ రిపోర్ట్