iDreamPost

రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు..

రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు..

గత కొన్ని రోజుల వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు చల్లని కబురును అందించింది వాతావరణ శాఖ. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆకాశమంతా నల్లని మబ్బులు ఆవరించగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడుతుండడంతో రైతులు వానాకాలం సీజన్ కు సంబంధించి వ్యవసాయ పనులను ప్రారంభించారు. భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం 12 జిల్లాలు, సోమవారం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లోనూ రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో వర్షాలు జోరుగా కురువనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు జులై నెలలో లానినా ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పింది భారత వాతావరణ శాఖ. ఇక నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అతి భారీ వర్షం కురిసింది. అక్కడ 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా గుడాపూర్ లో 4.8, నారాయణపేట జిల్లా కోస్గి లో 4.5, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 4.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 3.3 ఇలా పలు జిల్లాల్లో వానలు కురిశాయి.

Heavy rains in state

రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇక్కడ ఇలా ఉంటే నార్త్ లో మాత్రం భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రికార్డ్ స్థాయి ఎండలతో బెంబేలెత్తిస్తున్నాడు. అధిక వేడి వడగాల్పులతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే నిన్న నార్త్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురువడంతో ప్రజలు ఉపశమనం పొందారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి