Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024 బరిలోకి దిగేముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ మాస్టర్ ప్లాన్ తో వస్తున్నామని చెప్పాడు. అయితే ప్లాన్ అప్పుడు ఎవ్వరికీ అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు అదే ప్రణాళిక టీమిండియాకు విజయాలను అందిస్తోంది. అదేంటో చూద్దాం పదండి.
టీ20 వరల్డ్ కప్ 2024 బరిలోకి దిగేముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ మాస్టర్ ప్లాన్ తో వస్తున్నామని చెప్పాడు. అయితే ప్లాన్ అప్పుడు ఎవ్వరికీ అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు అదే ప్రణాళిక టీమిండియాకు విజయాలను అందిస్తోంది. అదేంటో చూద్దాం పదండి.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన జోరును కొనసాగిస్తూ.. అప్రతిహాసంగా దూసుకెళ్తోంది. కప్ గెలవడమే లక్ష్యంగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్.. అటువైపుగానే సాగుతోంది. సెమీస్ లో ఇంగ్లండ్ ను ఓడించి.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మెగాటోర్నీ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పాడు. అయితే దానికి కారణం మాత్రం వెల్లడించలేదు. కానీ ఇప్పుడు రోహిత్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని రుజువుచేస్తున్నారు స్పిన్నర్లు.
వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో పాల్గొనే ముందు జట్లు తమ తమ వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంటాయి. అయితే టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే గ్రౌండ్స్ న బట్టి కూడా జట్టులో మార్పులు, కూర్పులు చేయాల్సి వస్తుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన సారథి విజయాలు చవిచూస్తాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో చేసింది ఇదే. ముందుగానే వరల్డ్ కప్ టోర్నీ నిర్వహించే పిచ్ లను అంచనా వేసి జట్టును సిద్ధం చేశాడు రోహిత్. కాగా.. టీ20 ప్రపంచ కప్ 2024లో పాల్గొనే ముందు ప్రెస్ కాన్పరెన్స్ లో మాట్లాడిన రోహిత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ టోర్నీలో మేం నలుగు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే దీనికి కారణం మాత్రం ఇప్పుడు చెప్పనని, అప్పుడు చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా.. అమెరికా లాంటి కొత్త పిచ్ లపై పేసర్లు ప్రభావం చూపిస్తారని, నువ్వేంటి నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతానని అంటున్నావ్ అంటూ.. రోహిత్ పై కొందరు పెదవి విరిచారు. కానీ అప్పుడు రోహిత్ ప్లాన్ ఎవ్వరికీ అర్ధం కాలేదు.. ఇప్పుడు ఆ ప్లానే ఇండియాను గెలిపిస్తోంది. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని రోహిత్ భావించాడు. అందులో భాగంగానే యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లను స్వ్కాడ్ లో ఉండేలా చూశాడు. ఇప్పుడు వారే టీమిండియాకు విజయాలు అందిస్తూ వస్తున్నారు. జడేజా ఒక్కడే రాణించడం లేదుగానీ అక్షర్, కుల్దీప్ యాదవ్ లో పరిస్థితులను బట్టి వికెట్లను తీస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కుల్దీప్, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లతో రాణించారు. పిచ్ కండీషన్స్ బట్టి, ప్రత్యర్థిని బట్టి జట్టును సిద్ధం చేస్తూ వచ్చాడు హిట్ మ్యాన్. ఇక ఈ టోర్నీలో కుల్దీప్ ఇప్పటి వరకు 10 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ కూడా అద్బుత బౌలింగ్ తో విజయాల్లో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. వెస్టిండీస్ పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయని ముందుగానే అంచనా వేసిన రోహిత్.. నలుగు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని అనుకున్నాడు. అందుకే స్వ్కాడ్ లో వారు ఉండేలా చూసుకున్నాడు. అయితే ముగ్గురు స్పిన్నర్లు బాగా రాణిస్తుండటంతో చాహల్ కు అవకాశం రాలేదు. మరి విండీస్ పిచ్ లను ముందుగానే అంచనా వేసి మాస్టర్ ప్లాన్ తో టీమిండియాకు విజయాలు అందిస్తున్న రోహిత్ కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.