iDreamPost

Virat Kohli: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు! బంగ్లా, జింబాబ్వే ప్లేయర్ల సరసన..

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగి.. తన పేరిట ఓ చెత్త రికార్డును నెలకొల్పుకోవడమే కాకుండా.. బంగ్లా, జింబాబ్వే ప్లేయర్ల సరసన నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగి.. తన పేరిట ఓ చెత్త రికార్డును నెలకొల్పుకోవడమే కాకుండా.. బంగ్లా, జింబాబ్వే ప్లేయర్ల సరసన నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Virat Kohli: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు! బంగ్లా, జింబాబ్వే ప్లేయర్ల సరసన..

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగాటోర్నీల్లో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి.. ఫైనల్లోకి అడుగుపెట్టింది. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇక టైటిల్ పోరులో సౌతాఫ్రికాను ఢీకొనాల్సి ఉంది. ఇంత వరకు అంతా సంతోషమే అయినప్పటికీ.. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవ్వడం టీమిండియాతో పాటుగా ఫ్యాన్స్ ను తీవ్రంగా అసంతృప్తికి గురిచేస్తోంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా కోహ్లీ(9)తక్కువ రన్స్ కే ఔట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏకంగా బంగ్లా, జింబాబ్వే ప్లేయర్ల సరసన నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగుల వరదపారించిన ఈ రన్ మెషిన్ ప్రస్తుతం దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో ఎవ్వరూ ఊహించని విధంగా కోహ్లీ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఈ టోర్నీ ఆరంభం నుంచి ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న విరాట్.. పూర్తిగా చేతులెత్తేశాడు. చిన్న జట్లపై కూడా పరుగులు చేయడంలో విఫలం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కూడా 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి.. తన పూర్ ఫామ్ ను కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఎడిషన్ లో(మినిమమ్ 5 ఇన్నింగ్స్ లు) అతి తక్కువ యావరేజ్ ను నమోదు చేసిన ఓపెనర్ల జాబితాలో చిన్న జట్ల బ్యాటర్ల సరసన నిలిచాడు విరాట్. ఈ చెత్త రికార్డు లిస్ట్ లో బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ తొలి ప్లేస్ లో ఉన్నాడు. అతడు 2016 వరల్డ్ కప్ లో 9.60 యావరేజ్ తో పరుగులు చేశాడు. ఆ తర్వాత 9.80 యావరేజ్ తో జింబాబ్వే ఓపెనర్ వెస్లే మధేవేరే(2022) ఉండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో 10.71 యావరేజ్ తో 7 ఇన్నింగ్స్ ల్లో 75 రన్స్ మాత్రమే చేశాడు.

అదీకాక తొలిసారి టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ పూర్ ఫామ్ ను చూసి ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో అయినా మెరుపులు మెరిపించాలని కోరుకుంటున్నారు. ఇక ఈ జాబితాలో విరాట్ తర్వాత బంగ్లా ప్లేయర్ తంజిమ్ హసన్, తమీమ్ ఇక్బాల్ ఉన్నారు. కోహ్లీ ఇలా బంగ్లా, జింబాబ్వే ప్లేయర్ల సరసన నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి