iDreamPost

Darshan Case: దర్శన్‌పై టాలీవుడ్ హీరో నాగశౌర్య సంచలన పోస్ట్‌..

  • Published Jun 28, 2024 | 8:45 AMUpdated Jun 28, 2024 | 8:45 AM

Naga Shaurya: అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌కు సొంత ఇండస్ట్రీ నుంచే మద్దతు కరువైన వేళ.. టాలీవుడ్‌ హీరో నాగశౌర్య చేసిన పోస్ట్‌ ఒకటి సంచలనంగా మారింది. ఆ వివరాలు..

Naga Shaurya: అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌కు సొంత ఇండస్ట్రీ నుంచే మద్దతు కరువైన వేళ.. టాలీవుడ్‌ హీరో నాగశౌర్య చేసిన పోస్ట్‌ ఒకటి సంచలనంగా మారింది. ఆ వివరాలు..

  • Published Jun 28, 2024 | 8:45 AMUpdated Jun 28, 2024 | 8:45 AM
Darshan Case: దర్శన్‌పై టాలీవుడ్ హీరో నాగశౌర్య సంచలన పోస్ట్‌..

కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ ఓ అభిమానిని హత్య చేయించిన కేసులో అరెస్ట్‌ అయ్యి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడితో పాటు మరో నటి పవిత్ర గౌడను కూడా అరెస్ట్‌ చేశారు. ఇక ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రేణుకా స్వామి అనే వ్యక్తి.. పవిత్ర గౌడను సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకర పదజాలంతో దూషించినందుకు గాను.. దర్శన్‌ అతడిని కిడ్నాప్‌ చేయించి.. చిత్ర హింసలు పెట్టి అత్యంత దారుణంగా హతమార్చాడని ఆరోపణలు. ఈ కేసులో దర్శన్‌ అరెస్ట్‌ అయ్యి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఈ కేసులో దర్శన్‌తో పాటు మరో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. దర్యాప్తులో రోజుకో సంచలన విషయం, సాక్ష్యం వెలుగులోకి వస్తుండటంతో.. దర్శన్‌ మీద ఆగ్రహం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇక ఈ కేసు విషయంలో దర్శన్‌కు సొంత ఇండస్ట్రీ నుంచే పెద్దగా మద్దతు రావడం లేదు. ఈ క్రమంలో టాలీవుడ్‌ నటుడు నాగశౌర్య దర్శన్‌కు మద్దతివ్వడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

దర్శన్‌కు మద్దతుగా నాగశౌర్య చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ మాత్రమే కాక సంచలనంగా మారింది. ‘‘మృతి చెందిన వ్యక్తి (రేణుకాస్వామి) కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అయితే ఈ కేసులో అందరూ అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేయడం నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు.. దర్శన్ అన్న ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టే వ్యక్తి కాదు. కలలో కూడా అలాంటి ఆలోచన చేయరు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయన ముందుంటాడు. దర్శన్‌ అన్న ఎంటో ఆయనతో పరిచయమున్న ప్రతి ఒక్కరికి తెలుసు,. చాలామందికి కష్టకాలంలో తోడున్నాడు. ఇక దర్శన్‌ అన్న మీద వస్తోన్న వార్తల్ని నేను నమ్మడం లేదు. నాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకముంది. త్వరలోనే నిజం బయటపడుతుంది’’అని రాసుకొచ్చాడు నాగశౌర్య.

‘‘ఈ కేసు వల్ల మరో కుటుంబం (దర్శన్ ఫ్యామిలీ) కూడా బాధపడుతోందని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి సమయంలో ఆ కుటుంబ సభ్యులకు కాస్త ప్రైవసీ కల్పించాలి. మీపై నాకు నమ్మకముంది అన్న. మీరు అమాయకుడు అనేది తేలుతుంది. అసలు నేరస్థుడు ఎవరనేది త్వరలోనే బయటపడుతుంది’’ అంటూ నాగశౌర్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శన్ నిందితుడు అని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ దొరికిన ఆధారాలను చూస్తే.. రేణుకా స్వామిని ఎంత దారుణంగా హత్య చేశారో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఇలాంటి టైంలో హీరో నాగశౌర్య.. దర్శన్‌కు మద్దతుగా పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ఎంత అభిమానం ఉన్నాసరే కొన్ని సందర్భాల్లో దాన్ని దాచుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి పోస్టులు పెట్టడం.. అంటే స్వయంగా విమర్శల్ని ఆహ్వానించినట్లు అవుతుంది అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి