iDreamPost

IND vs ENG: టీమిండియాపై జోకులు.. వడ్డీతో సహా ఇచ్చి పడేసిన టీమిండియా దిగ్గజం!

టీమిండియాపై జోకులు వేసిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశాడు టీమిండియా దిగ్గజం. అతడు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియాపై జోకులు వేసిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశాడు టీమిండియా దిగ్గజం. అతడు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs ENG: టీమిండియాపై జోకులు.. వడ్డీతో సహా ఇచ్చి పడేసిన టీమిండియా దిగ్గజం!

టీమిండియా ఎప్పుడు ఓడిపోతుందా? ఎప్పుడెప్పుడు ఆ టీమ్ పై విమర్శలు చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు పాకిస్తాన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు. మరీ ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అయితే సమయం చిక్కినప్పుడల్లా తన నోటిదురుసును బయటపెట్టుకుంటూ ఉంటాడు. అయితే అతడు భారత్ పై సెటైర్లు వేసినప్పుడల్లా టీమిండియా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది. తాజాగా ఇంగ్లండ్ పై సెమీ ఫైనల్లో విజయం సాధించిన తర్వాత మైఖేల్ వాన్ కు వడ్డీతో సహా ఇచ్చిపడేశాడు టీమిండియా దిగ్గజం వసీం జాఫర్. అసలు ఏం జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

అది 2022 టీమిండియా-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్ ను సౌతాఫ్రికా 3-0తో కైవసం చేసుకుంది. దాంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన నోటిదూలను బయటపెట్టుకున్నాడు. ఎప్పుడూ ఇండియా మీద పడి ఏడ్చే అతడు.. భారత్ ఈ సిరీస్ కోల్పోవడంతో.. ట్విట్టర్ వేదికగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ వసీం జాఫర్ ను ట్యాగ్ చేస్తూ.. ‘హోప్ యూ ఆర్ ఒకే’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఆ ట్వీట్ కు వడ్డీతో సహా లెక్క సరిచేశాడు వసీం జాఫర్. తాజాగా ఇంగ్లండ్ పై వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంతో.. వాన్ కు కౌంటర్ ఇచ్చాడు. ‘హోప్ యూ ఆర్ ఒకే’ అని వాన్ ను ట్యాగ్ చేస్తూ.. చిన్న పిల్లాడి వీడియోతో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా.. టీమిండియా మాజీ దిగ్గజం వసీం జాఫర్ తనదైన శైలిలో టీమిండియాపై సెటైర్లు వేసిన వారిపై విరుచుకుపడుతూ ఉంటాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇండియాపై 2022లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే.. గుర్తు పెట్టుకుని మరీ లెక్కలు సరిచేశాడు. అదీకాక 2022 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 10 వికెట్లతో ఓడించింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ప్రస్తుతం జాఫర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇండియన్స్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వాన్ గతంలో టీమిండియాపై వేసిన సెటైర్లకు వడ్డీతో సహా జాఫర్ లెక్క సరిచేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి