iDreamPost

Rohit Sharma: సెమీస్ లో ఇంగ్లండ్ చిత్తు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ! తొలి కెప్టెన్ గా..

సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ను చిత్తు చేసి.. సగర్వంగా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ వివరాల్లోకి వెళితే..

సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ను చిత్తు చేసి.. సగర్వంగా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: సెమీస్ లో ఇంగ్లండ్ చిత్తు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ! తొలి కెప్టెన్ గా..

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు.. అందుకు తగ్గట్లుగానే అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకొచ్చింది. గయనా వేదికగా గురువారం రాత్రి ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా.. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ లో రాణించగా.. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ బౌలింగ్ లో అదరగొట్టారు. గయనా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుతగలడంతో, మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న టెన్షన్ అందరిలో కలిగింది. అయితే వర్షం తగ్గడంతో.. ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం అయ్యింది. తొలు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మూడో ఓవర్లోనే షాకిచ్చాడు టోప్లే. ఈ  టోర్నీలో దారుణంగా విఫలం అవుతూ వస్తున్న కోహ్లీ(9)ని మరోసారి తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేర్చాడు. పంత్(4)కూడా వెంటనే ఔట్ కావడంతో.. 40/2తో టీమిండియా కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ కు జత కలిసిన సూర్యకుమార్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మంచి జోరుమీదున్నాడు. వీరిద్దరు మూడో వికెట్ కు 73 పరుగులు జోడించారు. అనంతరం 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 57 రన్స్ చేసిన రోహిత్ ను ఆదిల్ రషీద్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్(47)కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17*) అక్షర్ పటేల్(10) పరుగులు చేశారు. దాంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి171 పరుగులు చేసింది టీమిండియా. క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ను స్పిన్నర్లు అక్షర్ పటేల్(3), కుల్దీప్ యాదవ్(3) బెంబేలెత్తించారు. వీరిద్దరి ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 68 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ ల్లో ఫిఫ్టీ కొట్టిన తొలి ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ ఘనత వహించాడు. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ కూడా నాకౌట్ మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీ కొట్టలేదు. 2007 టీ20 వరల్డ్ కప్ లో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన 36  పరుగులే ఇప్పటి వరకు అత్యధిక స్కోర్ గా ఉంది. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేశాడు హిట్ మ్యాన్.

దీంతో పాటుగా టీమిండియా కెప్టెన్ గా 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్. అలాగే టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత ప్లేయర్ గా కూడా నిలిచాడు. ఇప్పటి వరకు 50 సిక్సర్లు బాదాడు రోహిత్. కాగా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా బాబర్ అజమ్ రికార్డు బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. ఇప్పటి వరకు భారత్ కు 61 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 49 మ్యాచ్‌లను  గెలిపించాడు. మరోవైపు బాబర్ ఆజామ్ 85 మ్యాచ్‌ల్లో పాక్‌కు 48 విజయాలు అందించాడు. ఒక్క మ్యాచ్ లోనే ఇన్ని రికార్డులు రోహిత్ శర్మ బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి