iDreamPost

OTT Release: ఇవాళ ఒక్కరోజే OTTలోకి 12 సినిమాలు.. వాటిల్లో చూడాల్సినవి మాత్రం ఆ మూడే..

  • Published Jun 28, 2024 | 10:24 AMUpdated Jun 28, 2024 | 10:24 AM

OTT Movies Release: శుక్రవారం వచ్చింది. థియేటర్‌తో పాటు ఓటీటీలోకి బోలేడు కొత్త సినిమాలు వచ్చేస్తాయి. ఇక ఈ శుక్రవారం ఏకంగా 12 మూవీలు వచ్చేశాయి. ఆ వివరాలు..

OTT Movies Release: శుక్రవారం వచ్చింది. థియేటర్‌తో పాటు ఓటీటీలోకి బోలేడు కొత్త సినిమాలు వచ్చేస్తాయి. ఇక ఈ శుక్రవారం ఏకంగా 12 మూవీలు వచ్చేశాయి. ఆ వివరాలు..

  • Published Jun 28, 2024 | 10:24 AMUpdated Jun 28, 2024 | 10:24 AM
OTT Release: ఇవాళ ఒక్కరోజే OTTలోకి 12 సినిమాలు.. వాటిల్లో చూడాల్సినవి మాత్రం ఆ మూడే..

ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాలి. లేదంటే అది టీవీల్లో వచ్చే వరకు ఎదురు చూడాలి. మధ్యలో చూడాలంటే.. అప్పట్లో డీవీడీలు, వీసీడీలు అందుబాటులో ఉండేవి. వాటిని రెంట్‌కు తెచ్చుకుని కొత్త సినిమాలు చూసి ఆనందించేవాళ్లం. అయితే కాలంతో పాటు.. సినిమాలు చూసే విధానం కూడా మారుతుంది. కరోనా తర్వాత.. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సినిమా ఎంతో బాగుంది అనుకుంటే తప్ప జనాలు థియేటర్‌కు వెళ్లడం లేదు. ఇదే సమయంలో ఓటీటీల హవా కూడా అంతే పెరిగింది. ఇప్పుడు కొత్త సినిమా చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. నెల రోజులు ఆగితే.. ఓటీటీలో విడుదల అవుతుంది. అప్పుడు ఎంచక్కా.. మనకు నచ్చిన సమయంలో.. ప్రశాంతంగా మూవీ చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

ఓటీటీలకు క్రేజ్‌ పెరుగుతుండటంతో.. ఆయా ప్లాట్‌ఫామ్‌లు కూడా భారీగా ఖర్చు చేసి.. ప్రేక్షకులను అలరించడం కోసం భాషతో సంబంధం లేకుండా హిట్టు సినిమాలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో మరో వారం వచ్చేసింది. దాంతో ఓటీటీలో రిలీజ్‌ అయ్యేందుకు అనేక మూవీలు, వెబ్‌ సిరీస్‌లు క్యూ కట్టాయి. ఈ వారం కూడా 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే వాటిలో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూసే సినిమాలు పెద్దగా లేవని చెప్పవచ్చు.

ఇక ప్రతి శుక్రవారం కాస్తా ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలో దర్శనం ఇస్తుంటాయి. అలా ఇవాళ అంటే జూన్ 28న ఒక్కరోజే ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. అయితే వాటిల్లో కేవలం మూడు చిత్రాల మీదనే తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అవే భజే వాయువేగం, కాజల​ సత్యభామ, నవదీప్‌ లవ్‌ మౌళి సినిమాలపై మాత్రమే కాస్త ఆసక్తి ఉంది.  మరి ఈ రోజు ఏ ఓటీటీల్లోకి ఏ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్

  • ది కార్ప్స్ వాషర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 28
  • ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28
  • ది విర్ల్ విండ్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 28
  • ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28
  • భజే వాయు వేగం (తెలుగు సినిమా)- జూన్ 28

అమెజాన్ ప్రైమ్

  • శర్మాజీ కీ బేటీ (హిందీ చిత్రం)- జూన్ 28
  • సివిల్ వార్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28
  • సత్యభామ (తెలుగు సినిమా)- జూన్‌ 28

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

  • వండ్ల (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28
  • ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఆవేశం (హిందీ డబ్బింగ్ సినిమా)- జూన్ 28

జీ5

  • రౌతు కీ రాజ్ (హిందీ చిత్రం)- జూన్ 28

సైనా ప్లే

  • హిగ్యుటా (మలయాళ మూవీ)- జూన్ 28

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి