iDreamPost

హస్తినాలో బాబుకు ఎదురుదెబ్బ.. పవన్‌తో కొత్త రాయబారం!

Chandrababu: టీడీపీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం తెగ ఆరటపడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బుధవారం చేసిన ఢిల్లీ పర్యటన విఫలమైందనే ప్రచారం జరుగుతోంది.

Chandrababu: టీడీపీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం తెగ ఆరటపడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బుధవారం చేసిన ఢిల్లీ పర్యటన విఫలమైందనే ప్రచారం జరుగుతోంది.

హస్తినాలో బాబుకు ఎదురుదెబ్బ.. పవన్‌తో కొత్త రాయబారం!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలోనే గెలుపే లక్ష్యంగా  అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తోన్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఓటమి భయంతో అల్లాడిపోతున్నారని టాక్. అందుకే పొత్తుల కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇప్పటికే  జనసేనాతో పొత్తులో ఉన్న బాబు, బీజేపీ కోసం కూడా ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ టూర్ వేశారు. అయితే అక్కడ బాబుకు భారీ ఎదురు దెబ్బ తగినట్లు సమాచారం.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయ జీవితం అంతా పొత్తులమయ్యే అనే విషయం అందరికి తెలిసిందే. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు దేశంలోని అన్ని జాతీయ పార్టీలతో బాబు పొత్తు పెట్టుకున్నారు.  చంద్రబాబు గెలిచిన ఎన్నికలు మొత్తంగా పొత్తులే ఆధారం అయ్యాయి. ఆయన ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు. అలా 2019లో  మాత్రమే పోటీ చేశారు. అయితే బాబు ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే  ఫలితాలు ఎలా ఉంటాయో అందరూ ప్రత్యక్షంగా చూశారు.

అందుకే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుక బాబుకు ధైర్యం చాలడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే సీఎం జగన్ ని ఢీ కొట్టేందుకు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ బలం కూడా తమకు సరిపోదని భావించిన బాబు.. మోదీ హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నాడు. ఏం చేసైనా, ఎలాగైనా బీజేపీతో పొత్తు కోసం నానా తంటాలు పడుతున్నాడు. హస్తినా వీధుల్లో తిరుగుతూ ప్లీజ్ ఒక్కసారైనా  కలవండి సార్ అంటూ బీజేపీ అధినాయకత్వాన్ని ప్రసన్నం కోసం పడిగాపుల కాస్తున్నాడని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏ స్థితికి చంద్రబాబు వెళ్లారంటే.. ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే అనేంతలా ఫిక్స్ అయ్యారని టాక్. ముందు పొత్తు మాత్రం కావాలని బాబు ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాంట్మెంట్ కోసం వేచి చూశాడు. చివరకు చాలా సమయం తరువాత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబును పిలిచినట్లు సమాచారం. చాలా తక్కువ సమయం మాత్రమే బాబుతో వారిద్దరు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక వీరి భేటీ సందర్బంగా జేపీ నడ్డా పది నిమిషాలు ముందే వెళ్లినట్లు సమాచారం.

ఇక బీజేపీ పెద్దలతో భేటీ అనంతం చంద్రబాబు సైతం మౌనంగా ఉన్నారు. దీంతో, టీడీపీతో పొత్తుకు వారు ససేమిరా అన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ రాయబారం నడుపుతున్నాడు. ఎలాగైనా పొత్తు ఖరారు చేసేలా పవన్ తో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఇలా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు  పడరాని పాట్లు పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి..ఢిల్లీలో చంద్రబాబు టూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి