iDreamPost
android-app
ios-app

జియో కీలక నిర్ణయం.. మరో రీఛార్జ్ ప్లాన్ లో మార్పులు!

ఇటీవలే జియో టెలికాం సంస్థ రూ.999 రీఛార్జ్ ధరలో మార్పులు  చేసిన సంగతి తెలిసింది. తాజాగా మరో మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ లోనూ మార్పులు చేసింది. దీంతో జియో మరోసారి తన కస్టమర్లకు ఊరట నిచ్చింది

ఇటీవలే జియో టెలికాం సంస్థ రూ.999 రీఛార్జ్ ధరలో మార్పులు  చేసిన సంగతి తెలిసింది. తాజాగా మరో మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ లోనూ మార్పులు చేసింది. దీంతో జియో మరోసారి తన కస్టమర్లకు ఊరట నిచ్చింది

జియో కీలక నిర్ణయం.. మరో రీఛార్జ్ ప్లాన్ లో మార్పులు!

నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఇక వీరి కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే.. ఇటీవలే రీఛార్జ్ ఫ్లాన్ల ధరలు పెరిగిన సంగతి తెలిసింది. రిలయన్స్ జియో ఈ టారిఫ్ ఛార్జీలను పెంచడంతో అదే బాటలో మిగిలిన కంపెనీలు నడిచాయి. ఈ క్రమంలో టెలికాం సంస్థలపై కస్టమర్లలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జియో కొన్ని రీచార్జ్ ప్లాన్ల విషయంలో కీలక మార్పులు చేసి.. కస్టమర్లను సంతృప్తి పరుస్తుంది. ఇటీవలే రూ.999న ప్లాన్ లో మార్పులు చేసిన జియో.. తాజాగా మారో ప్లాన్ లో మార్పులు చేసింది.

ఇటీవల టెలికాం రంగంలో కీలక మార్పులు జరిగిన సంగతి తెలిసింది. అన్ని టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. దీంతో కస్టమర్లపై అదనపు భారం పడినట్లు అయింది. అంబానీ ఇంట పెళ్లి కోసం ఇలా జియో రీఛార్జ్ ధరలు పెంచారని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం వచ్చాయి. ఇలా తమపై అంసతృప్తి వచ్చిన నేపథ్యంలో జియో  కాస్తా దిగొస్తోన్నట్లు పలువురు అభిప్రాయా పడుతున్నారు. అందుకే ఈ మధ్య ప్లాన్ల ధరలు పెంచాక కొన్ని రీఛార్జ్ ప్లాన్లకు సంబంధించి జియో కొన్ని కీలక మార్పులు చేసింది.

ఇటీవలే రూ.999 రీఛార్జ్ ధరలో మార్పులు  చేసిన సంగతి తెలిసింది. తాజాగా రిలయన్స్ జియో మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ.349 ప్లాన్ లో మార్పులు చేసింది. కొన్ని రోజుల క్రితం రూ.999 ప్లాన్ విషయంలో మార్పు చేసి..వినియోగదారులకు ఊరట నిచ్చారు. అలానే తాజాగా రూ.349 ప్లాన్ తో మరోసారి కస్టమర్లకు ఊరటనిచ్చారు. తాజాగా రూ. 349 ప్లాన్ వ్యాలిడిటీ విషయంలో జియో మార్పు చేసింది. ఇప్పటి వరకు గతంలో ఈ ప్లాన్ విషయంలో 28 రోజులు మాత్రమే ఉండేది. ఈ వ్యాలిడిటినీ పరిమితిని 28 నుంచి 30 రోజులకు పెంచింది.

తాజాగా రూ.349 ప్లాన్ లో చేసిన మార్పులతో ఎంజాయ్ చేయొచ్చని జియో ప్రకటించింది. రెండు రోజుల వ్యాలిడిటీ పెరిగిందంటే 4జీజీ హై స్పీడ్ డేటా కూడా ఈ రీచార్జ్ ప్లాన్లో భాగంగా వినియోగదారులు పొందుతారు. మొత్తంగా జియో రూ.349 రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటాతో 30 రోజుల వరకూ ఎంజాయ్ చేయవచ్చు. రీఛార్జ్ ధరలు పెరగక ముందు.. ఈ రూ.349 ప్లాన్.. రూ.299 గా ఉండేది. రూ.349 ప్లాన్ పేరును జియో హీరో 5జీగా మార్చింది. మొత్తంగా ఇటీవల వరుసగా జియో..తన కస్టమర్లకు కాస్తా ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తుంది.