iDreamPost
android-app
ios-app

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. వర్షాలకు ఇప్పట్లో నో బ్రేక్‌..

  • Published Jul 25, 2024 | 5:46 PMUpdated Jul 25, 2024 | 5:54 PM

Next 3 Days Rains in AP & Telangana : రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని.. వర్షాలకు ఇప్పట్లో నో బ్రేక్‌ అని తెలిపింది. ఆ వివరాలు..

Next 3 Days Rains in AP & Telangana : రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని.. వర్షాలకు ఇప్పట్లో నో బ్రేక్‌ అని తెలిపింది. ఆ వివరాలు..

  • Published Jul 25, 2024 | 5:46 PMUpdated Jul 25, 2024 | 5:54 PM
Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. వర్షాలకు ఇప్పట్లో నో బ్రేక్‌..

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్‌ నగరం అయితే తడిసి ముద్దవుతుంది. బుధవారం రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తుంది. అయితే మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న జోరు వానల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో జనాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక భాగ్యనగర వాసులు ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్‌ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్ప పీడనం కారణంగా వర్షాలకు ఇప్పట్లో బ్రేక్‌ పడే అవకాశం లేదని తెలిపింది. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతాంలో వరుసగా అల్ప పీడనాలు ఏర్పడుతుండటంతో.. వర్షాలకు ఇప్పట్లో బ్రేక్‌ పడేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతాంలో మరో అల్ప పీడనం ఏర్పడిందని.. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు, నాలుగు రోజులు వర్షాలకు నో బ్రేక్‌ అని సమాచారం.

అల్ప పీడన కారణంగా.. ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నాలుగు రోజుల పాటు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 40-50 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి జనాలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు.. చెట్ల కింద నిల్చోరాదని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

తెలంగాణలో ఇలా..

ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు అనగా గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక నేడు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇక రానున్న మూడు రోజుల పాటు నిర్మల్‌, నిజామాబాద్‌, జనగాం, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి