iDreamPost
android-app
ios-app

గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. వాహనదారులకు తీరనున్న కష్టాలు..!

Google Maps: నేటికాలంలో ఏదైనా ప్రదేశానికి వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను తప్పనిసరిగా వినియోగిస్తారు. అలానే ఈ గూగుల్ మ్యాప్ కూడా వినియోగదారులకు అనేక సదుపాాయాలను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

Google Maps: నేటికాలంలో ఏదైనా ప్రదేశానికి వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను తప్పనిసరిగా వినియోగిస్తారు. అలానే ఈ గూగుల్ మ్యాప్ కూడా వినియోగదారులకు అనేక సదుపాాయాలను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. వాహనదారులకు తీరనున్న కష్టాలు..!

ప్రతి ఒక్కరూ అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్ నే అనుసరిస్తున్నారు. ఫ్లై ఓవర్ ఎదురైనప్పుడు చాలా మంది వాహనదారులు అయోమయానికి గురవుతారు. ఫ్లై ఓవర్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు మీద నుంచి వెళ్లాలా లేక ఫ్లై ఓవర్ ఎక్కి వెళ్లాలా అనేది తికమక ఎదురవుతుంది. ఈ అయోమయంలో చాలా మంది వెళ్లాల్సిన రూటులో కాకుండా వేరే మార్గంలో వెళ్తుంటారు. దీని వల్ల పెట్రోల్, సమయం, శ్రమ అన్నీ వృధా అవుతాయి. అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో వస్తున్న కొత్త ఫీచర్ తో ఈ కష్టాలకు చెక్ పడనుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఒకప్పుడు ఒక కొత్త ప్రాంతానికి, అడ్రెస్ కి వెళ్లాలంటే.. చాలా సమయం వృథా అయ్యేది. ఎంతో మందిని అడుగుతూ మనం చేరాల్సిన ప్రదేశానికి చేరుతుంటాము. కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చాక.. ఆ కష్టాలకు చెక్ పడిన సంగతి తెలిసింది. ఏ కొత్త ప్రాంతానికైనా క్షణాల్లోనే చేరుకుంటాము. అంతేకాక మనం వెళ్లే ప్రదేశంలో, లేదా మన ఉండే పరిసరాల్లో ఉండే ఏటీఎంలు, హోటళ్లు, థియేటర్లు, పెట్రోల్ బంకులు వంటి అనేక ముఖ్యమైన వాటిని కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని వినియోగించే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇదే సమయంలో వినియోదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త కొత్త ఫీచర్లను అందిస్తుంది.  అలానే తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్లైఓవర్‌ కాల్‌ ఔట్‌’ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

గూగుల్ మ్యాప్ పెట్టుకుని వాహనంపై వెళ్లే క్రమంలో కొన్ని సార్లు ఇబ్బందులు పడుతుంటాము. ముఖ్యంగా ఎదురుగా ఫ్లైఓవర్‌, దాని దిగువన సర్వీస్‌ రోడ్డు వంటివి వచ్చినప్పుడు కాస్తా ఇబ్బంది పడుతుంటాము. పొరపాటును ఏ రాంగ్ రూట్ లో వెళ్లిన సమయం, ఇంధనం ఖర్చు అవుతుంది. ఇలా ప్లై ఓవర్ ఎదురైనప్పుడు  పై నుంచి వెళ్లాలా? కింది నుంచి వెళ్లాలా? అనే సందేహం వస్తే.. దీనికి గూగుల్‌ మ్యాప్స్‌ పరిష్కారం చూపింది. ఈ ‘ఫ్లైఓవర్‌ కాల్‌ ఔట్‌’ యాప్ తో పరిష్కారం లభించనుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్ వినియోగదారులు ఎప్పటినుంచో కోరుతున్న ఈ ఫీచర్‌ ఈ వారంలోనే అందుబాటులోకి రానుంది. ఐఓఎస్‌ యూజర్లకు కాస్త ఆలస్యంగా అందుబాటులోకి రానుంది..

వీటితో పాటు మరికొన్ని ఫీచర్లనూ గూగుల్‌ గురువారం ప్రకటించింది. ఈ ఫీచర్ తో పాటు మరికొన్నిటిని  గురువారం ప్రకటించారు. ఇరుకు రోడ్లకు సంబంధించి మరో ఫీచర్‌ను కూడా గూగుల్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫోర్‌ వీలర్లో వెళ్లేటప్పుడు రోడ్లు ఇరుకుగా ఉంటే.. అలాంటి సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా గూగుల్‌ మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్‌ చూపించనుంది. ఈ సదుపాయాన్నితొలుత 8 నగరాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. అలానే కొన్ని నగరాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్‌లను కనుగొనడం, మెట్రో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం వంటి సదుపాయలను తీసుకురానుంది. ఓఎన్‌డీసీతో భాగస్వామ్యం ద్వారా మెట్రో టికెట్లనూ బుక్ చేసుకునే సదుపాయని ప్రజలకు అందించనుంది. ఇక తాజాగా గూగుల్ అందించనున్న ఈ కొత్త యాప్స్ పై కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.