iDreamPost
android-app
ios-app

ఇండియాలో దగ్గు మందులు ఇంత డేంజరా? చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి!

  • Published Jul 26, 2024 | 8:24 PM Updated Updated Jul 26, 2024 | 8:24 PM

గత కొంతకాలంగా ఇండియాలోని తయారు చేసే దగ్గు సిరప్ వాళ్ల ఇతర దేశాల్లోని చిన్నారులు మరణిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది దగ్గు సిరప్ లను చిన్నారులకు పట్టాలంటేనే భయపడుతున్నారు. అయితే తాజాగా ఇండియాలోని ఈ దగ్గు సిరప్ వలన ఎంతమంది చనిపోయారు? ఈ సిరప్ ఎంత డేంజరో తెలిస్తే షాక్ అవుతారు.

గత కొంతకాలంగా ఇండియాలోని తయారు చేసే దగ్గు సిరప్ వాళ్ల ఇతర దేశాల్లోని చిన్నారులు మరణిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది దగ్గు సిరప్ లను చిన్నారులకు పట్టాలంటేనే భయపడుతున్నారు. అయితే తాజాగా ఇండియాలోని ఈ దగ్గు సిరప్ వలన ఎంతమంది చనిపోయారు? ఈ సిరప్ ఎంత డేంజరో తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Jul 26, 2024 | 8:24 PMUpdated Jul 26, 2024 | 8:24 PM
ఇండియాలో దగ్గు మందులు ఇంత డేంజరా? చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి!

సాధారణంగా ఎవరైనా  సీజనల్ ఇన్​ఫెక్షన్స్  వాళ్ల కానీ, మరి ఏ ఇతర  కారణాల చేతగానీ దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. అలాంటి సమయంలో ఆసుపత్రికి వెళ్లిన, మెడికల్ స్టోర్ కి వెళ్లిన కచ్చితంగా అక్కడ ట్యాబ్లెట్స్ తో పాట, దగ్గు సిరప్ వంటివి ఇస్తుంటారు. ఇలా చాలామంది ఇళ్లల్లో చిన్న నుంచి పెద్ద వరకు దగ్గు సిరప్ ఎక్కువగా వాడుతుంటారనే విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఇండియాలో ఈ దగ్గు సిరప్ లను వాడలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

ఎందుకంటే.. గత కొంతకాలంగా ఇండియాలోని తయారు చేసే దగ్గు సిరప్ వాళ్ల ఇతర దేశాలైన గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్‌ వంటి దేశాల్లో అభం శుభం తెలియని చిన్నారులు చాలామంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే ఈ ఘటనలకు కారణం ఇండియాలోని తయారైన సిరప్ లే కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషణ్ 2022లో తేల్చి చెప్పింది.  పైగా  ఇప్పటి వరకు ఆయా దేశాల్లో అభం శుభం తెలియని 141 మంది చిన్నారులు ప్రాణాలను ఈ దగ్గు సిరప్ లు బలితీసుకున్నాయి. ముఖ్యంగా వీటిలో 100కు పైగా ఇండియాలోని తయారైన సిరప్ లే పిల్లల మరణలకు కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇకపోతే గాంబియా దేశంలో 2022 మేలో 66 మంది చిన్నారులు ఇండియా ఉత్పత్తి చేసిన దగ్గు మందుల కారణంగా చనిపోయారనే వార్త అప్పట్లో ఎంతటి కలకరం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అప్పటి నుంచి ఆ దేశఆలు ఇండియాలో తయారైన ఈ సిరప్ లను బ్యాన్ చేశాయి. దీంతో పాటు భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్‌లు క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్‌ అయ్యాయని, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెల్లడించింది. అంతేాకాకుండా.. ఈ దగ్గు మందుల్లోని కొన్ని శాంపిళ్లలో డైథైలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) వంటి విష పదార్థాలు ఉన్నాయని తేలింది.

పైగా డీఈజీ, ఈజీ, అస్సే, మైక్రో బ్యాక్టిరియా పెరుగుదల, పీహెచ్‌ వాల్యూ వంటి వాటి కారణంగా ఆయా సిరప్‌ల బ్యాచ్‌లను నాణ్యతా ప్రమాణాలు లేని వాటిగా అధికారులు గుర్తించారు. ఇక CDSCO, రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగాల సహాయంతో ఆయా కంపెనీల సేల్స్, డిస్ట్రిబూషన్ గుర్తించి ప్రొపైలిన్ గ్లైకాల్ పంపిణీదారులను తనిఖీ చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 141 మంది చిన్నారుల మరణాలకు భారత్‌లో ఉత్పత్తి అయిన దగ్గు మందులే కారణమని ఆరోపణలు వచ్చిన భారతీయ సిరప్ లను .. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లు టెస్టింగ్‌లు చేస్తున్నాయి. మరి, 141 మంది చిన్నారుల మరణానికి ఇండియన్ దగ్గు సిరప్ లే కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషణ్ తేల్చి చెప్పడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.