Nidhan
లంక పర్యటనలో ఉన్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో అదరగొడుతోంది. ఆతిథ్య జట్టును చిత్తు చేద్దామని డిసైడ్ అయిన మెన్ ఇన్ బ్లూ.. నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు.
లంక పర్యటనలో ఉన్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో అదరగొడుతోంది. ఆతిథ్య జట్టును చిత్తు చేద్దామని డిసైడ్ అయిన మెన్ ఇన్ బ్లూ.. నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు.
Nidhan
టీ20 ఛాంపియన్ టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ సిరీస్‌కు రెడీ అవుతోంది. పొట్టి ప్రపంచ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వే టూర్‌కు వెళ్లిన భారత్.. ఇప్పుడు శ్రీలంకతో టీ20లు ఆడేందుకు సిద్ధమైంది. రేపు జరిగే మొదటి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. రెండు వారాల పాటు సాగే ఈ టూర్లో మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో బిజీ అయిపోయింది. ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. లంకను వైట్‌వాష్ చేయాలని పట్టుదలతో ఉన్న ప్లేయర్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఇవాళ స్పెషల్ ఫీల్డింగ్ డ్రిల్ నిర్వహించారు. ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లు సాధన చేశారు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు మిగిలిన ప్లేయర్లంతా క్యాచ్‌లు అందుకోవడం, త్రోలు చేయడంపై ఫోకస్ చేశారు. వికెట్లను టార్గెట్ చేస్తూ దూరం నుంచి త్రోలు విసిరారు. అలాగే రన్నింగ్ క్యాచ్‌లు పట్టుకోవడం సాధన చేశారు. అయితే ఈ సెషన్లో హైలైట్ అంటే సంజూ శాంసన్ పట్టిన క్యాచ్ అనే చెప్పాలి. కుడి వైపునకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ టైమ్‌లో అతడి బాడీ గాల్లోనే ఉంది. ఈ క్యాచ్ చూసిన కోచ్ గంభీర్ షాకయ్యాడు. శాంసన్ కళ్లుచెదిరే ఫీల్డింగ్‌కు ఫిదా అయిన గౌతీ సంతోషంతో నవ్వుల్లో మునిగిపోయాడు.
ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్ మొహంలో నవ్వు తెప్పించాడు శాంసన్. అతడితో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా గాల్లో డైవ్ చేస్తూ ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. సంజూ ఫీల్డింగ్ ప్రాక్టీస్‌తో పాటు కీపింగ్ సాధన కూడా చేశాడు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఓ రోలర్‌ను పెట్టి అతడికి ఫాస్ట్‌గా త్రోలు చేస్తూ కీపింగ్ ప్రాక్టీస్ చేయించాడు. రిషబ్ పంత్ కూడా కీపింగ్ చేస్తూ కనిపించాడు. అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్లతోనూ క్యాచ్‌లు, రనౌట్లు ప్రాక్టీస్ చేయిస్తూ చెమటలు కక్కించారు దిలీప్-గంభీర్. ఆటగాళ్ల నుంచి బెస్ట్ రాబట్టేందుకు ప్రయత్నించారు. ఇంత కష్టపడిన ప్లేయర్లు.. మధ్య మధ్యలో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ప్రాక్టీస్ సెషన్‌ను ఎంజాయ్ చేశారు. మరి.. సంజూ-సిరాజ్ ఫీల్డింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
The fielding drills of Team India in Sri Lanka.🇮🇳
– The atmosphere and happiness of every players so beautiful to see. ❤️pic.twitter.com/D2u6uevvwL
— Tanuj Singh (@ImTanujSingh) July 26, 2024