iDreamPost
android-app
ios-app

బెంగుళూరు లేడీస్ హాస్టల్‌లో మిస్టరీ! పోలీసులకే ఏమి అర్థం కావడం లేదు!

పిల్లలపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు తల్లిదండ్రులు. తమనేదో ఉద్దరిస్తారని కాదు. వాళ్ల ఉన్నత స్థితిలో ఉంటే.. ఎవ్వరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి రాదని, అందుకే దూర భారాలైనా వెళ్లి చదువుకుంటామంటే ఓకే చెబుతున్నారు. కానీ అక్కడకు వెళ్లాక..

పిల్లలపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు తల్లిదండ్రులు. తమనేదో ఉద్దరిస్తారని కాదు. వాళ్ల ఉన్నత స్థితిలో ఉంటే.. ఎవ్వరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి రాదని, అందుకే దూర భారాలైనా వెళ్లి చదువుకుంటామంటే ఓకే చెబుతున్నారు. కానీ అక్కడకు వెళ్లాక..

బెంగుళూరు లేడీస్ హాస్టల్‌లో మిస్టరీ! పోలీసులకే ఏమి అర్థం కావడం లేదు!

చదువుల పేరుతో మరో ప్రాంతానికి వెళుతున్న కొంత మంది అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు.  తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు.  చిన్న చిన్న కారణాలతో తమను తాము సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు కొందరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ.. మానసికంగా క్షోభ పడుతూ.. చావే శరణ్యమని మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. సమస్యను సాల్వ్ చేసుకునే వైపుగా ఆలోచన చేయకుండా.. ఇక పరిష్కారం కాదని భావించి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మార్కులు సరిగా రాలేదని, తల్లిదండ్రులు తిట్టారని, ప్రేమను లవర్ ఒప్పుకోలేదని, బ్రేకప్ అయ్యిందని, పెద్దలు తమ ప్రేమ ప్రపోజల్ ఒప్పుకోవడం లేదని, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, చివరకు పక్కింటి వాళ్లు తిడుతున్నారని కూడా కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశాం. ఇదిగో ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన నర్సింగ్ స్టూడెంట్ కూడా ఇలానే చేసింది.

రోగులకు మందులతో పాటు మాటలు చెబుతూ ధైర్యం నూరిపోయాల్సిన నర్సింగ్ విద్యార్థినే.. చివరకు అధైర్యంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. ఇదిగో ఈ ఫోటోలో హీరోయిన్‌లా కనిపిస్తున్న అమ్మాయి పేరు దియా మండోల్. ఆమెది పశ్చిమ బెంగాల్. అయితే ఆమె బెంగళూరులోని మదర్ థెరిసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో రెండో సంవత్సరం చదువుతుంది. హాస్టల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే… శనివారం హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తోటి విద్యార్థులు గదికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇదిలా ఉంటే.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దియా మరణించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దియా తల్లి బోనాని రాయ్ మోండల్.. ఈ వాదనలు కొట్టిపారేస్తుంది. శనివారం సాయంత్రం తన కూతురి తనతో బాగానే మాట్లాడిందని, ఒక గంటకే తనకు చనిపోయిదంటూ కాల్ వచ్చిందని పేర్కొంది. తన కూతురు చాలా స్ట్రాంగ్ అని, ఆర్థిక ఇబ్బందులు ఉంటే తమకు చెప్పుకునేదని, అలాంటివి ఏమీ లేదని తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదంటూ పేర్కొంది. ఇదిలా ఉంటే ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.. బెంగళూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తగిన విచారణ జరపేలా చర్యలు తీసుకోవాలని దియా తల్లి బోనాని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.