iDreamPost
android-app
ios-app

కోల్‌కతా నిందితుడు సంజయ్​ రాయ్‌కి లై డిటెక్టర్​ పరీక్ష.. ఏం చెప్పాడంటే..!

  • Published Aug 26, 2024 | 1:25 PM Updated Updated Aug 26, 2024 | 1:25 PM

Kolkata Trainee Doctor Case Latest Updates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కోల్‌కొతా ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ హత్యచారం గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న సంజయ్ రాయ్ కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహంచారు సీబీఐ.

Kolkata Trainee Doctor Case Latest Updates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కోల్‌కొతా ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ హత్యచారం గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న సంజయ్ రాయ్ కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహంచారు సీబీఐ.

కోల్‌కతా నిందితుడు సంజయ్​ రాయ్‌కి లై డిటెక్టర్​ పరీక్ష.. ఏం చెప్పాడంటే..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రెయినీ వైద్యురాలి రేప్, మర్డర్ ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని సామాన్యులు, వైద్యులు, సెలబ్రెటీలు సైతం ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రం, కేంద్రం కూడా సీరియస్ గా ఉన్నాయి. అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్టు అనుమతితో సంజయ్ రాయ్ సహా మరికొందరికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ రేప్, మర్డర్ ఘటనపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీ కార్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష తో పాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. విచారణ ఖైదీగా ఉంచిన ప్రెసిడెన్షీ జైలులోనే సీబీఐ అధికారుల సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు. మిగిలిన వారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్ చేశారు. ఈ టెస్టులో ఎన్నో రకాల ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సీక్ సైన్స్ ల్యాబోరేటరీకి చెందిన పాలిగ్రాఫ్ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. సాధారణంగా నిందితులు నేరం ఒప్పుకోకుంటే పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తారు. లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్దాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు.

నిన్న ఆదివారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ పరీక్షలు పూర్తి అయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడు ఏం చెప్పారన్న విషయాలు గోప్యంగా ఉంచారు. లై డిటెక్టర్ పరీక్షలో నిందితులు చెప్పిన అంశాలను సాక్ష్యాలుగా కోర్టులో ప్రవేశ పెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఇదిలా ఉంటే..  కోల్‌కొతా ఘటన జరిగిన తర్వాత పోలీసులు సంజయ్ రాయ్‌ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తనే నేరం చేసినట్లు అంగీకరించాడు. కానీ పాలీగ్రాఫ్ టెస్ట్‌కు ముందు ప్లేట్ పిరాయిస్తూ తాను నిర్ధోషిని అని.. తనను ఇరికించారని చెప్పి షాక్ ఇచ్చాడు.   అరెస్ట్ చేసిన తర్వాత ఒక మాట, లై డిటెక్టర్ పరీక్షలో పొంతనలేని మాటలు మాట్లాడుతున్నాడని సీబీఐ అంటుంది. పాలీగ్రామ్ టెస్ట్ సందర్భంగా నిందితుడు తాను సెమినార్ హాల్ కి వెళ్లే సరికి బాధితురాలు చనిపోయి ఉందని.. భయంతో తాను అక్కడ నుంచి పారిపోయానని చెప్పినట్లు తెలుస్తుంది. అసలు మర్డర్ జరిగినపుడు తాను వేరే ప్రదేశంలో ఉన్నానని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, నిందితుడు ఏం చెప్పాడు అన్న విషయం అధికారులు గోప్యంగా ఉంచారు.  మరి ఈ కేసు మునుముందు ఎన్ని కీలక మలుపులు తిరుగుతోందో చూడాలి.