iDreamPost
android-app
ios-app

బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత!

Buddhadeb Bhattacharjee: పశ్చిమ్ బెంగాల్ లో విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురువారం కన్నుముూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు.

Buddhadeb Bhattacharjee: పశ్చిమ్ బెంగాల్ లో విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురువారం కన్నుముూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు.

బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత!

పశ్చిమ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన తుది  శ్వాస విడిచారు. గతకొంతకాలం నుంచి  ఆయన అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన బెంగాల్ రాష్ట్రానికి చాలా కాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. ఆయన మృతితో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

బుద్ధదేవ్ భట్టాచార్య సీపీఎం పార్టీతో తన రాజకీయ ప్రస్థాన్నా ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన వయస్సు 80 ఏళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన బాధ పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  గతేడాది అతనికి న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో కాస్తా కోలుకుని తిరిగి  ఇంటికి చేరుకున్నారు. అయితే ఇటీవలే మళ్లీ అనారోగ్యం సమస్య రావడంతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం కోల్ కత్తాలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

బుద్ధదేవ్ భట్టాచార్య 2000 నుండి 2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు తర్వాత  పవర్ ఫుల్ సీఎంగా బుద్ధదేవ్ నిలిచారు. ఇక 2011లో మమత బెనర్జీ కి చెందిన తృణముల్ కాంగ్రెస్ విజయం సాధించడంతో 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు ఎండ్ పడింది. ఇక భట్టాచార్య రాజకీయాల్లోకి రాకముందు స్కూల్ టీచర్ గా పని చేశారు. 2000లో జ్యోతిబస్సు దిగిపోయే వరకు భట్టచార్య డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా 2001, 2006లో అసెంబ్లీ ఎన్నికల విజయాలకు సిపిఎంను నడిపించాడు. భట్టాచార్జీ హయాంలో, జ్యోతిబసు పాలనతో పోలిస్తే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వ్యాపారం పట్ల సాపేక్షంగా బహిరంగ విధానాన్ని అనుసరించింది. మొత్తంగా పశ్చిమ్ బంగాల్ రాష్ట్రంలో తనదైన ముద్రను వేశారు బుద్ధదేవ్ భట్టాచార్య. కొన్ని సంవత్సరాలుగా ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు. చూపు మందగించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రజా జీవితానికి దూరమయ్యారు.