iDreamPost
android-app
ios-app

కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసు.. ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!

Kolkata Trainee Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో రోజు కో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. తాజాగా నిందితుడైన సంజయ్ రాయ్ ట్విస్ట్ ఇచ్చాడు.

Kolkata Trainee Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో రోజు కో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. తాజాగా నిందితుడైన సంజయ్ రాయ్ ట్విస్ట్ ఇచ్చాడు.

కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసు.. ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!

కోల్ కతా లో జరిగిన ట్రైని డాక్టర్ హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. ఈ దారుణ ఘటనతో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలు ఎగసి పడుతున్నాయి. మృతురాలి కుటుంబాన్ని న్యాయం జరగాలంటూ, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి వైద్యులు,ఇతర వర్గాల వారు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఉన్నాయి. ఇప్పటికే  హత్యాచార కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ అను అరెస్టు చేసి..విచారణ కూడా చేశారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ ట్విస్ట్ ఇచ్చాడు.

కోల్ కతా  ట్రైనీ డాక్టర్ పై హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ను స్థానిక సీబీఐ కోర్టు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కోర్టులో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. పాలీ గ్రాఫ్ టెస్టుకు ఎందుకు సమ్మతించావాని మెజిస్ట్రేట్..నిందితుడిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ క్రమంలో అతడు భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. “నేను అమాయకుడిని, ఏ తప్పూ చేయలేదు. నన్ను ఇరికించారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది’ అని జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. అందుకే తాను పాలీ గ్రాఫ్ పరీక్షకు  ఒప్పుకున్నానని న్యాయముర్తితో నిందితుడు తెలిపినట్లు సమాచారం.

దీంతో ఇప్పటికే ఈ కేసులో అనేక ట్విస్టులు చోటుచేసుకోగా..తాజాగా ఈ ట్విస్ట్ నెలకొంది. ఇక పాలిగ్రాఫ్ పరీక్ష అనేది నేర అంచనాల నుండి ప్రాథమిక కారణాల వరకు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీని ద్వారా నిందితుడు నేరానికి సంబంధించిన  అంశాలపై నిజాలు చెప్తున్నాడా లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఇటీవలే నిందితుడికి సీబీఐ అధికారులు సైకోనాలసిస్ టెస్టు చేయించిన సంగతి తెలిసింది. ఆ సందర్భంగాలో అతడినిలో కనీసం భయం, బాధ అనేవి కనిపించలేదని సీబీఐ అధికారులు గుర్తించారు. మానవ మృగంలా అతడి ప్రవర్తన తీరు ఉందని తెలిసింది.

అయితే తాజాగా సీబీఐ కోర్టులో కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడుతూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. అలానే ఇటీవల ఘటన జరిగిన హాస్పిటల్‌ సెమినార్ హాల్‌లోకి నిందితుడు ప్రవేశిస్తోన్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మెడలో బ్లూటూత్ డివైజ్ వేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు ఆ గదిలోకి ప్రవేశించినట్టు ఈ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటో గా తీసుకుని విచారణ జరపుతోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో రోజు కో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది.