తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. తెలంగాణ ప్రదేశ్కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ.. అసమ్మతి రాగం వినిపించడంతో ఇటీవల పార్టీ హైకమాండ్ చర్యలకు గురయ్యారు. జగ్గారెడ్డి ఏమి మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తనకు మంత్రి కావాలనే ఆశలేదన్నారు. ప్రభుత్వం (టీఆర్ఎస్) వచ్చి మంత్రి పదవి ఇస్తానని అన్నా.. తీసుకోబోనని చెప్పారు. జగ్గారెడ్డి ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం […]
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పంజాబ్లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరుచుకుంది. అంతర్గత కుమ్ములాటల వల్లనే పంజాబ్లో ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ పరిణామం తర్వాత మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి వల్ల నష్టం జరిగే పరిస్థితి రానీయకూడదని హస్తం పెద్దలు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణలో పార్టీ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుతో అర్థమవుతోంది. […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా జీవన్ రెడ్డి ఖరారయ్యారని, నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ తెరపైకి మొదలైంది. రాష్ట్రంలోనాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తో పాటు కొంత మంది సీనియర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు.. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హైకమాండ్ పెద్దలకు […]
టీపీసీసీ కోసం ఆ రాష్ట్ర నేతలు చేస్తున్న విన్నపాలు, పైరవీలు, ఆ పదవికి ఆయన అర్హుడు కాదని ఒకరు.. ఈయన అర్హుడు కాదని ఇంకొకరు, ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం.. ఒకరు తర్వాత మరొకరు ఢిల్లీక రావడం, పోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిని నియమించే వ్యవహారం తమకు తలనొప్పిగా మారినట్లు భావిస్తోంది. అధిష్ఠానంపై రకరకాల ఒత్తిళ్లు తేవడం, ఢిల్లీ యాత్రలు చేపట్టడం పార్టీ పెద్దలకు చికాకుగా మారింది. […]
కుదేలవుతున్న కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలిచ్చేదెవరు? ఇప్పుడీ ప్రశ్న తెలంగాణలో అందరి మదినీ తొలుస్తోంది. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీ పగ్గాలు ఎవరు చేపడుతారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం గట్టి కసరత్తే చేసింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో పార్టీ పెద్దలందరితోనూ సంప్రదింపులు నిర్వహించారు. వేరు వేరుగా […]
జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పదవి ఎవరికి అనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం సుమారు 162 మంది వివిధ స్థాయి నాయకుల వద్ద పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సేకరించిన అభిప్రాయాలు, ఇతర మార్గాల ద్వారా ఏఐసీసీ సేకరించిన సమాచారం ఆధారంగా అధిష్ఠానం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కులాలు, వర్గాల వారీగా సమీక్షించిన […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త అధ్యక్షుడుగా ఎవరు రాబోతున్నారు..? అధిష్టానం ఎవరిని ఎంపిక చేయబోతోంది..? వచ్చే నేత కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టగలడా..? అతనికి పార్టీలోని సీనియర్ నేతలు సహకరిస్తారా..? లాంటి అనేక సందేహాలు ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొన్నాయి. టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్లు రేసులో […]