iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ నేత మధు‌యాష్కీ గౌడ్ ఇంట తీవ్ర విషాదం!

  • Published Apr 15, 2024 | 3:57 PM Updated Updated Apr 15, 2024 | 4:16 PM

Madhu Yashki Goud Mother Passesaway: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Madhu Yashki Goud Mother Passesaway: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

కాంగ్రెస్ నేత మధు‌యాష్కీ గౌడ్ ఇంట తీవ్ర విషాదం!

ఇటీవల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంటుంది. అభిమానులు, కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల కన్నుమూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో సేవలు అందిస్తూ వస్తున్నారు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్.  కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన నివాళులుర్పిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మధుయాష్కీ గౌడ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కాంగ్రెస్ పార్టీలో కీలన నేతగా ఎదిగిన మధుయాష్కీ గౌడ్.. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి మంచి సన్నిహితులు అంటారు. తాజాగా మధుయాష్కీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి  యాష్కి అనసూయగౌడ్ (85) సోమవారం ఉదయం స్వర్గస్తులైనారు.  గత కొంతకాలంగా అనసూయ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను స్టార్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆమె ఉదయం 8 గంట ప్రాంతంలో తుది శ్వాస విచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మధుయాష్కి గౌడ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. మధుమాష్కీ పుట్టిన తర్వాత ఆయన చిన్నాన్న పోచయ్య, అనసూయ దంపతులు పెంచుకున్నారు.

Madhuyaski goud

ఆమె పార్థీవ దేహం మధ్యాహ్నం హయత్ నగర్ లోని మధుయాష్కీ ఇంటికి చేరుకుంది. మధుయాష్కి గౌడ్ కి పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధుయాష్కీ గౌడ్ 2004, 2009లో 15వ లోక్ సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత 2023 జులై 14 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. మధుయాష్కీ 2004 లో భారత పార్లమెంట్ కు ఎన్నుకోబడిన ప్రథమ, ఏకైక ప్రవాస భారతీయుడు కావడం మరో విశేషం.