ప్రజల తీర్పును శిరసా వహిస్తాం.. ఓటమికి గల కారణాలను తెలుసుకుని అధిగమిస్తాం.. భవిష్యత్ లో మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తాం.. ఇదీ సాధారణంగా ఏ పార్టీ అయినా ఓడిపోతే చెప్పే మాటలు. అందరిలా తానూ ఉంటే ఎలా అనుకున్నారో ఏమో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందన వింతగా ఉంది. తాను ఓడిపోవడానికి గల కారణాలపై మాట్లాడకుండా వైసీపీకి ఐదు లక్షల మెజారిటీ రాకపోవడం ఆనందంగా ఉందట. మరో విచిత్రం ఏంటంటే.. తిరుపతి ఎన్నికలో ఓటింగ్ శాతం […]
ఆంధ్రప్రదేశ్ లో అప్రహతిహతంగా కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంపై కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పంచాయతీ, మున్సిపాల్టీ, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నిక ఏదైనా ఆ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. విపక్షాలు ఎన్ని ఎత్తులు, జిత్తులు వేస్తున్నా పాచికలు పారడం లేదు. తలకిందులుగా తపస్సు చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. గెలుపు కాదు కదా.. కనీసం గెలుస్తామన్న ఆశ కూడా వారికి ఇవ్వడం లేదు. సంక్షేమ సారథి, […]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి తిరుగులేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ విషయం విపక్షాలకు కూడా ముందే తెలుసు. అందుకే గెలుపు కోసం కాకుండా ద్వితీయ స్థానం కోసం, గతంలో వచ్చిన ఓట్ల కంటే కాస్తయినా ఎక్కువ ఓట్లు సంపాదించడం కోసం కష్టపడ్డాయి. ఫలితం దక్కుతుందా, లేదా అనేది పక్కన బెడితే.. […]
తిరుపతి ఉప ఎన్నికలో గెలవాలని ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది బీజేపీ. కానీ అధికార వైఎస్సార్ సీపీ ముందు తేలిపోయింది. కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ లీడర్లు బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చి ప్రచారం చేసినా.. ఫలితం మారలేదు. ప్రజలు ఏకపక్షంగా వైసీపీకి పట్టంకట్టారు. భారీ మెజారిటీ దిశగా గురుమూర్తి దూసుకువెళ్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ను బట్టి చూస్తే బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు […]
ఎన్నిక ఏదైనా అధికార పార్టీ వైసీపీదే హవా అని ఏపీ వరుస ఎన్నికలు తెలియజేస్తున్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కూడా అదే నిరూపిస్తుందా..? అంటే అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. విపక్షాల ఆశలు గల్లంతు అయ్యేలా ఫలితాల సరళి ఉంది. భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్సీపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల్లో తొలిరౌండ్లో 32,397 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు […]
ఐదు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి ఉప ఎన్నిక ఇదే కావడంతో.. అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే విజయం ఎవరిదన్నదానిపై ఎవరికీ సందేహాలు లేకపోవడమే ఈ ఉప ఎన్నిక విశేషం. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన మద్దతుతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసినా.. అదంతా రెండో స్థానం కోసమేనన్నట్లు సాగింది. విజయం తమదేనని […]
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమయ్యింది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు కూడా పాటిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు ప్రకటించారు. కౌంటింగ్ లోకి రావాలనుకుంటున్న అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ కాలేజీలో లెక్కిస్తారు. చిత్తూరు జిల్లా […]
ఒకప్పుడు రాజకీయాలు చాలా హుందాగా సాగేవి. కాలంతో పాటు నాయకులు మారుతూ రాజకీయాలను బ్రష్టు పట్టించారు. ఇటీవల కాలంలో నాయకులు తాము ఏం మాట్లాడుతున్నామో అని తెలియకుండానే మాట్లాడేసి నవ్వుల పాలవుతున్నారు. చింతా మోహన్. రాజకీయాలపై ఏ కొంచెం అవగాహన ఉన్న వారికైనా ఈ పేరు సుపరిచితమే. కాంగ్రెస్ నేతగా ఒక వెలుగు వెలిగారు. 5 సార్లు ఎంపీగా గెలిచి, పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇంత అనుభవం ఉన్న నేత ఎంత హుందాగా మాట్లాడాలి.? ఆరోపణలు […]
దేశంలో తానే సీనియర్ రాజకీయనాయకుడనని, తన అంత అనుభవం మరెవరికీ లేదని చెప్పుకుంటుంటారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తన గురించి తాను చెప్పుకునే మాటలకు.. వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన ఉండదని తిరుపతి ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుతో మరోమారు తేలిపోయింది. ‘‘ ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అప్రజాస్వామికంగా, అత్యంత సందేహాస్పదమైన పోలింగ్ జరిగింది. దొంగ ఓట్లు భారీగా వేయించారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో […]
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ-జనసేన కూటమి భవితవ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తానే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని తపించిన బీజేపీ అందుకు జనసేనపైనే పూర్తిగా ఆధారపడింది. అయితే ఆశించినంత సహకారం అటువైపు నుంచి లభించలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తీరుతో మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ నుంచి కూడా […]