ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలనుసైతం ఆనందంగా ఇచ్చేస్తుంది. బిడ్డకు కష్టం వస్తే తాను విలవిల్లాడిపోతుంది. ఓ పూట తిన్నా.. తినకపోయినా బిడ్డల కడుపు నింపడానికే చూస్తుంది. రాజ్యాన్ని పాలించే రాణి అయినా.. దేశానికి ప్రధాని అయినా బిడ్డల విషయంలో తల్లి ప్రాధాన్యతలు మారిపోతాయి. తల్లి ప్రేమకు అద్దం పట్టే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ మహిళా మేయర్ నెలల చంటి బిడ్డతో ఆఫీసుకు వెళ్లింది. […]
ఇటీవలి కాలంలో DYI విధానం బాగా పాపులర్ అవుతోంది. ఏదైనా సొంతంగా తయారుచేయడం, సొంతగా సృష్టించడం, సృజన చేయడంపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలోనూ ట్యూటోరియల్స్, లెర్నింగ్ వీడియోస్ సంఖ్య సైతం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు అలాంటి వీడియోనే ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో జరగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఒక మైనర్ బాలుడు యూట్యూబ్ లో చూసి వైన్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. […]
దేశ రాజధాని లేదా రాష్ట్రాల రాజధానుల నుంచి ప్రజలు ఆశించేంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమే. అవి ఎంత దూరం ఉన్నా సరే అక్కడ జీవనోపాధి ఉంటే చాలు అక్కడికి వెళతారు. అక్కడ ఉండే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులతో వారికి ఎలాంటి ఉపయోగం లేదు. వాటితో సామాన్య ప్రజలకు ఎలాంటి అవసరం ఉండదు. కేవలం రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మాత్రమే సచివాలయం, అసెంబ్లీతో పని ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్న ఉపాధి, […]