iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో మరో విషాదం.. ఫిష్ వెంకట్ ఇక లేరు

  • Published Jul 19, 2025 | 10:55 AM Updated Updated Jul 19, 2025 | 10:55 AM

ఇటీవల విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ వార్తా టాలీవుడ్ లో విషాదంలో నింపివేసింది. అయితే ఈ ఘటన మరువక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. గతకొంతకాలంగా నటుడు ఫిష్ వెంకటేష్ అనారోగ్యంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవల విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ వార్తా టాలీవుడ్ లో విషాదంలో నింపివేసింది. అయితే ఈ ఘటన మరువక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. గతకొంతకాలంగా నటుడు ఫిష్ వెంకటేష్ అనారోగ్యంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

  • Published Jul 19, 2025 | 10:55 AMUpdated Jul 19, 2025 | 10:55 AM
టాలీవుడ్ లో మరో విషాదం.. ఫిష్ వెంకట్ ఇక లేరు

ఇటీవల విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ వార్తా టాలీవుడ్ లో విషాదంలో నింపివేసింది. అయితే ఈ ఘటన మరువక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. గతకొంతకాలంగా నటుడు ఫిష్ వెంకటేష్ అనారోగ్యంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి వార్తలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇటీవలే కొందరు ప్రముఖులు ఈ నటుడికి ఆర్థిక సాయం కూడా అందజేశారు. కానీ కొద్దీ రోజులకే ఫిష్ వెంకటేష్ ఇలా కన్నుమూయడం విషాదం. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ కిడ్నీ సంబంధిత వ్యాధి ముదిరిపోవడంతో కోలుకునే అవకాశం లేకుండా పోయింది.

ఈ నటుడు పేరుకు చిన్న ఆర్టిస్ట్ అయినా కానీ ఎన్నో సినిమాలలో తన ప్రతిభను కనబరిచారు. ఫిష్ వెంకటేష్ కు ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉంది. బయట ఎక్కడ కనిపించినా కానీ ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈయన అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. జీవనోపాధిలో భాగంగా అతను చేపలు అమ్ముకుంటూ ఉండేవాడు. దీనితో క్రమంగా అదే అతని ఇంటి పేరుగా మారిపోయింది. దివంగత నటుడు శ్రీహరికి ఫిష్ వెంకటేష్ మంచి మిత్రుడు. ఓ సందర్భంలో ఆయన వివి వినాయక్ కు పరిచయం చేసినప్పుడు. సపోర్టింగ్ రోల్స్ లో బాగా పనికి వస్తాడని అనిపించి.. సినిమాలలో అవకాశం ఇచ్చారట. అలా జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో అతని సినీ ప్రయాణం మొదలైంది.

ఇక అప్పటినుంచి అతను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. బన్నీ, కింగ్, శౌర్యం, రెడీ, శంఖం, డాన్ శీను, వరుడు, అదుర్స్, మిరపకాయ్, వీర, కందిరీగ, గబ్బర్ సింగ్, నాయక్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా ఎన్నో సినిమాలలో మంచి సపోర్టింగ్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆకారిగా ఆయన చేసిన సినిమా జనవరిలో ఆహా ఓటిటిలో విడుదలైన కాఫీ విత్ కిల్లర్. ఏదేమైనా ఇలాంటి మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ ను ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి.