iDreamPost
android-app
ios-app

వీడియో: రెండు గొంతుల్లో పాడిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ట్రాన్స్ జెండర్ అంటూ ట్రోలింగ్!

  • Published Jul 20, 2024 | 10:32 PM Updated Updated Jul 20, 2024 | 10:32 PM

Trolls On Singer Lakshmi Jayan- Fans Strong Reply: ఒక లేడీ సింగర్ తన టాలెంట్ ని చూపించింది. ఒక పాటను లైవ్ లో రెండు గొంతుల్లో పాడి వినిపించింది. మేల్ వర్షన్, ఫీమేల్ వర్షన్ రెండూ తనే పాడింది. ఆమె టాలెంట్ ని మెచ్చుకోవాల్సింది పోయి కొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

Trolls On Singer Lakshmi Jayan- Fans Strong Reply: ఒక లేడీ సింగర్ తన టాలెంట్ ని చూపించింది. ఒక పాటను లైవ్ లో రెండు గొంతుల్లో పాడి వినిపించింది. మేల్ వర్షన్, ఫీమేల్ వర్షన్ రెండూ తనే పాడింది. ఆమె టాలెంట్ ని మెచ్చుకోవాల్సింది పోయి కొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

  • Published Jul 20, 2024 | 10:32 PMUpdated Jul 20, 2024 | 10:32 PM
వీడియో: రెండు గొంతుల్లో పాడిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ట్రాన్స్ జెండర్ అంటూ ట్రోలింగ్!

మీరు సోషల్ మీడియాలో చాలానే వీడియోలు చూస్తూ ఉంటారు. వాటిలో కొన్ని మాత్రం అరె భలే ఉంది వీడియో అనిపిస్తుంది. అలాంటి రెస్పాన్స్ మీ నుంచి రావాలి అంటే కచ్చితంగా అపరిమిత టాలెంటెండ్ అయి ఉండాలి. అయితే కొన్నిసార్లు టాలెంట్ ని కూడా చులకన చేస్తూ ట్రోల్ చేసేవాళ్లు పెరిగిపోయారు. ఇప్పుడు ఈ సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కు అదే ఎదురైంది. ఆమె ఎంతో అద్భుతంగా పాట పాడింది. మేల్ వర్షన్, ఫిమేల్ వర్షన్ రెండూ తనే పాడింది. ఆ పాట నెట్టింట వైరల్ కూడా అయ్యింది. అయితే ఆమె టాలెంట్ చూసి చాలా మంది మెచ్చుకుంటుంటే.. కొందరు మాత్రం ఆమె ట్రాన్స్ జెండర్ అయి ఉంటుంది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఆమె ఎవరో కూడా తెలియకుండానే కామెంట్లు పెట్టేస్తున్నారు.

ఇప్పుడు చెప్పుకుంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో కాదు.. సింగర్ లక్ష్మీ జయన్. తిరువానంతపురానికి చెందిన ఈ సింగర్ మల్టీ టాలెంటెండ్. ఈమె తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. రేడియో జాకీగా కూడా పని చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈమె తన టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైంది. అక్కడ పరువం వానగా నేడు కురిసేనులే పాటను లైవ్ లో పాడింది. అది కూడా లేడీ, జెండ్ వర్షన్స్ రెండూ తనే పాడింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కూడా అయ్యింది. అయితే కొంతమంది మాత్రం ఆమె ట్రాన్స్ జెండర్ అయి ఉంటుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. అందుకు ఆమె అభిమానులు కొందరు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

లక్ష్మీ జయన్ అభిమాని ఒకరు ఈ ట్రోలింగ్, కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించాడు. ఆమె నూటికి నూరు శాతం మహిళే. ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అంతేకాదు.. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె పాటలు పాడుతుంది. వైలన్ ప్లే చేస్తుంది. బిగ్ బాస్ స్టార్, టీవీ యాంకర్ గా చేసింది, రోడియో జాకీగా చేసిన అనుభవం కూడా ఉంది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ చేశాడు. అలాగే ఒకరి గురించి ఏం తెలియకుండా ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నంచాడు. మరి.. ఈ మల్టీ టాలెంటెండ్ సెలబ్రిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet