Swetha
క్రిస్టోఫర్ నోలన్.. ఈయన సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ప్రస్తుతం ఈయన "ది ఒడిస్సి"అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా చుట్టూ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దాదాపు ఇంకో సంవత్సరం పడుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే..
క్రిస్టోఫర్ నోలన్.. ఈయన సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ప్రస్తుతం ఈయన "ది ఒడిస్సి"అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా చుట్టూ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దాదాపు ఇంకో సంవత్సరం పడుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే..
Swetha
క్రిస్టోఫర్ నోలన్.. ఈయన సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ప్రస్తుతం ఈయన “ది ఒడిస్సి”అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా చుట్టూ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దాదాపు ఇంకో సంవత్సరం పడుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. అసలు రిలీజ్ ఎప్పుడో కూడా తెలియని ఈ సినిమాకు అప్పుడే హౌస్ ఫుల్ అయ్యింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
2026 జూలై 17-19 వీకెండ్ లో IMAX 70mm లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు మేకర్స్. దీనితో ఈ మూవీ కోసం రెండు రోజుల క్రితం టికెట్స్ అమ్మకానికి పెట్టారు. ఇలా పెట్టి పెట్టగానే ఒక్క గంటలోపే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇలా ప్రీ సేల్ వలన సుమారు 1.5 మిలియన్ వసూళ్లు వాచాయట. పైగా ఆ టికెట్స్ రేట్ $25-28 ఉండగా.. రీసెల్లర్స్ ఆ టికెట్స్ ను $300-$500 మధ్య అమ్మేస్తున్నారట. అమెరికాలోని AMC లింకన్ స్క్వేర్, AMC యూనివర్సల్, రిగల్ ఇర్విన్ స్పెక్ట్రమ్, సాన్‌ఫ్రాన్సిస్కో, డల్లాస్ , కెనడాలోని మిస్సిస్సాగా స్క్వేర్, వాన్, యూకేలో లండన్ IMAX, సైన్స్ మ్యూజియం, ఆస్ట్రేలియాలో మెయిన్ థియేటర్స్ ఇలా అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయట. కేవలం ఒక్క గంటలో ఇలా టికెట్స్ అన్ని అమ్ముడుపోవడం ఆశ్చర్యకరమైన విషయమని చెప్పాల్సిందే.
ది ఒడిస్సి.. హోమర్ రాసిన గ్రీకు ఇతిహాసానికి ఆధారంగా తీసుకున్నారు. మట్ డేమన్, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్ లాంటి ఎంతో మంది భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నారు . ఈ సినిమాలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాను కంప్లీట్ గా IMAX కెమెరాలతోనే షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది. సుమారు $250 మిలియన్ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తికాకముందే సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇక సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.