iDreamPost
android-app
ios-app

Vijay, Kerala: బిగ్ న్యూస్.. హీరో విజయ్ కారు ధ్వంసం! కారులో హీరో ఉండగానే!

  • Published Mar 19, 2024 | 11:37 AM Updated Updated Mar 19, 2024 | 11:37 AM

స్టార్‌ హీరో తలపతి విజయ్‌కి చేదు అనుభవం ఎదుదైంది. ఓ సినిమా షూటింగ్‌ కోసం కేరళ వెళ్లిన ఆయనకు అక్కడ కొంతమంది ఆయన కారుపై పడి విధ్వంసం సృష్టించారు. కారు ధ్వంసం అయింది. ఇదంతా ఎందుకు? ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం..

స్టార్‌ హీరో తలపతి విజయ్‌కి చేదు అనుభవం ఎదుదైంది. ఓ సినిమా షూటింగ్‌ కోసం కేరళ వెళ్లిన ఆయనకు అక్కడ కొంతమంది ఆయన కారుపై పడి విధ్వంసం సృష్టించారు. కారు ధ్వంసం అయింది. ఇదంతా ఎందుకు? ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 19, 2024 | 11:37 AMUpdated Mar 19, 2024 | 11:37 AM
Vijay, Kerala: బిగ్ న్యూస్.. హీరో విజయ్ కారు ధ్వంసం! కారులో హీరో ఉండగానే!

తమిళ స్టార్‌ హీరో తలపతి విజయ్‌కి ఎలాంటి మాస్‌ క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్‌ పేరు చెబితే తమిళనాడు పూనకంతో ఊగిపోతుంది. ఆయన సినిమా రిలీజ్‌ అయితే.. తమిళనాట జాతరే. సినిమా హిట్టా, ఫట్టా అనేది అనవసరం విజయ్‌ని స్క్రీన్‌పై చూశామా లేదా అన్నట్లు ఉంటుంది తమిళ ఫ్యాన్స్‌ యవ్వరం. విజయ్‌ అంటే పడిచచ్చిపోతారు తమిళ యువత. ఇప్పటికే కోలీవుడ్‌లో నంబర్‌ వన్‌ హీరోగా ఉన్న విజయ్‌.. తాజాగా పొలిటికల్‌ ఎంట్రీ కూడా ఇచ్చారు. తమిళగ వెట్రీ కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించి.. ప్రజాసేవకు సిద్ధమయ్యారు. అయితే.. పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో దిగే ముందు.. ఒప్పుకున్న సినిమాలన్ని చేసి.. ఆ తర్వాత ఒక నిఖార్సయిన పొలిటీషియన్‌గా మారాలన్నది విజయ్‌ ప్లాన్‌.

అయితే.. ఆయన ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు.. గోట్‌(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) అనే మూవీ షుటింగ్‌ కోసం ఆయన కేరళకు వెళ్లారు. అక్కడే విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారు ధ్వంసమైంది. విజయ్‌ కారులో ఉండగానే ఈ విధ్వంసం అంతా జరిగింది. అసలింతకి ఏం జరిగింది. విజయ్‌ కారును ఎవరు ధ్వంసం చేశారు లాంటి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. కేరళలో షూటింగ్‌ కోసం.. చెన్నై నుంచి తిరువనంతపురం చేరుకున్నాడు విజయ్‌. కానీ, అప్పటికే ఈ విషయం కొంతమంది విజయ్‌ ఫ్యాన్స్‌కు తెలిసిపోయింది. తమ అభిమాన హీరో తమ గడ్డపై అడుగుపెట్టాడని తెలిసి.. కేరళ విజయ్‌ ఫ్యాన్స్‌ తండోపతండాలుగా వచ్చారు. బైకులపై వంద సంఖ్యలో వచ్చిన అభిమానులు.. విజయ్‌ కారును ఫాలో అవుతూ.. ఎయిర్‌పోర్ట్‌ వరకు చేరుకున్నారు. అయితే.. అభిమానులను కంట్రోల్‌ చేయడం ఎవరి తరం కాలేదు.

విజయ్‌ని చూడాలనే వారి బలమైన కోరిక ముందు బారిగేట్స్‌ పనిచేయలేకపోయియి. విజయ్‌ని చూసేందుకు కారు పైకి ఎక్కేశారు అభిమానులు దీంతో.. కారు ముందు భాగం, వెనుక అద్దాలు అన్ని పగిలిపోయాయి. కారు భారీగా డ్యామేజ్‌ అయింది. అయినా కూడా తనను చూసేందుకు వచ్చిన అభిమానులపై విజయ్‌ ఏ మాత్రం కోపం చూపించలేదు. కసురుకోలేదు. తనపై వారు చూపిస్తున్న అభిమానానికి చలించిపోయాడు. ఎలాగోలా.. కారు నుంచి బయటపడిన విజయ్‌.. లోపలికి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కేరళలోనూ విజయ్‌కి ఉన్న క్రేజ్ చూసి.. సినీ జనాలే కాక, రాజకీయ పార్టీ నేతలు కూడా భయపడుతున్నారు. మరి విజయ్‌ క్రేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet