P Krishna
భార్యాభర్తల అనుబంధానికి మచ్చ తెస్తూ కొంతమంది అక్రమసంబంధాల నేపథ్యంలో ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి.
భార్యాభర్తల అనుబంధానికి మచ్చ తెస్తూ కొంతమంది అక్రమసంబంధాల నేపథ్యంలో ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి.
P Krishna
వేద మంత్రాల సాక్షిగా.. బంధు మిత్రుల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంటని నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో జీవించాలని దీవిస్తుంటారు. కానీ ఈ మద్యకాలంలో దంపతుల మధ్య వస్తున్న విభేదాల కారణంగా ఏడాదిలోపే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చాలా వరకు పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాల నేపథ్యంలో విడిపోతున్నారు. క్షణిక సుఖం కోసం కట్టుకున్న వారిని మోసం చేస్తూ జీవితాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. భర్త, బిడ్డ ను వదిలి ఓ మహిళ తన ప్రియుడితో వెళ్లిపోయింది.. చివరికి ఊహించని పరిస్థితికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే..
తిరువనంతపురం విటురాలోని అటవిలో ప్రాంతంలో మహిళ శవం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడి చేతిలో మహిళ హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో నిందితుడు అచ్చు(24) పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతురాలు సునీల (22) గా గుర్తించారు. తిరువనంతపురం కి చెందిన సునీల భర్త, బిడ్డను వదిలి తన ప్రేమికుడు అచ్చు తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం తన స్నేహితురాలితో కలిసి మెడికల్ కాలేజ్ కి వెళ్తున్నట్లుగా సునీల తన భర్తతో చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తర్వాత ఎంతకి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సునీల భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకొని పోలీసులు దర్యార్తు ప్రారంభించారు.
సునీల వాడిన మొబైల్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సునీల ప్రేమికుడు అచ్చుపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. ఈ విచారణంలో సంచలన నిజాలు బయట పెట్టాడు అచ్చు. తనకూ సునీలకు కొంతకాలంగా అక్రమసంబంధం కొనసాగుతుందని.. ఆమెను విడిపించుకోవాలని ప్రయత్నించే క్రమంలో హత్య చేయాల్సి వచ్చిందని ఒప్పుకున్నాడు. నింధితుడు ఇచ్చిన వాంగ్మూలం అనంతరం అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన సోదాల్లో కల్లంకుడిలోని ఖాళీ ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. సునీలకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. సంఘటనా స్థలంలో నెడుమంగడ్ డీవై ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. నిందితుడిని విటుర పోలీసులకు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి పంపించారు.