Tirupathi Rao
PG Doctor Takes Life: ఎన్నిసార్లు చెప్పినా.. ఎన్ని రకాలుగా చెప్పినా.. ఇప్పటికీ కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. పీజీ చదువుతున్న డాక్టర్ కూడా బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.
PG Doctor Takes Life: ఎన్నిసార్లు చెప్పినా.. ఎన్ని రకాలుగా చెప్పినా.. ఇప్పటికీ కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. పీజీ చదువుతున్న డాక్టర్ కూడా బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.
Tirupathi Rao
‘కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం’ అంటారు. నిజానికి అనుకోని ప్రమాదం వల్లనో.. అనారోగ్యం కారణంతోనే ప్రాణాలు కోల్పోవడం వేరు. కానీ, ఇప్పుడు చాలా మంది బలవంతంగా ఊపిరిని ఆపేసుకుంటున్నారు. కన్నతల్లి ప్రసవ వేధనలకు ఓర్చి ప్రసాధించిన జీవితాన్ని.. చిన్న చిన్న కారణాలతోనో- జీవితం మీద వైరాగ్యంతోనో మధ్యలోనే ముగించేస్తున్నారు. ఇప్పుడు ఒక పీజీ డాక్టర్ కూడా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుని.. కుటుంబాన్ని కన్నీటి సంధ్రంలోకి నెట్టేసింది. చావు ఏ సమస్యకు పరిష్కారం కాదనే విషయాన్ని గ్రహించలేక తనువు చాలించింది.
ఈ దారుణం తిరువనంతపురంలో జరిగింది. షహానా(28) అనే యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసి.. సర్జరీ డిపార్ట్ మెంట్ లో పీజీ కోర్సు చేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె తండ్రి కాలం చేశారు. ఆమెకు తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. పీజీ కోర్సు చదువుతున్న షహానాకు డాక్టర్ రువాయిస్ తో పెళ్లి సంబంధం కుదిరింది. అయితే వాళ్ల పెళ్లి పీటలు ఎక్కకముందే పెటాకులు అయ్యింది. కట్నకానుకల విషయంలో పొరపొచ్చాలు వచ్చినట్లు చెబుతున్నారు. పెళ్లికొడుకు తరఫున వాళ్లు అడిగినంత కట్నం షహానా కుటుంబం ఇవ్వలేకపోయింది. అయితే కట్నం కోరినంత ఇచ్చేందుకు సిద్గంగా లేరని రువాయిస్ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు.
పెళ్లి క్యాన్సిల్ కావడంతో.. షహానా డిప్రెషన్ లోకి వెళ్లిందని చెబుతున్నారు. ఆమె మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో తన అపార్టుమెంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను పీజీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి తల్లి, సోదరి.. షహానా ఆత్మహత్యకు డాక్టర్ రువాయిస్ కారణమంటూ వ్యాఖ్యానించారు. అతను అడిగిన కట్నం ఇవ్వలేకనే షహానా ప్రాణాలు తీసుకుందంటూ ఆరోపించారు. షహానా కుటుంబాన్ని కేరళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అడ్వకేట్ సతీదేవి పరామర్శించారు. షహానా ఆత్మహత్య ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే పూత్రి నివేదికను తమకు సమర్పించాలంటూ మహిళా కమిషన్ పోలీసులను కోరనుంది.
మరోవైపు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న డాక్టర్ రువాయిస్ ను అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తూ.. మెడికల్ పీజీ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసుపై త్వరిత గతిన విచారణ జరపాలంటూ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మహిళా శిశు అభివృద్ధి శాఖను కూడా ఆదేశించారు. వరకట్నం డిమాండుతోనే షహానా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రధానం ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అందరూ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు కూడా పరిష్కారం కాదు. ఆవేశంలో, అనాలోచితంగా తీసుకునే ఒక నిర్ణయం మొత్తం కుటుబాన్ని ఛిన్నాభిన్నం చేయచ్చు. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేయవచ్చు. పరిష్కారం దొరకని సమస్య ఏదీ ఉండదు. కానీ, ఆత్మహత్య మాత్రం అందుకు సమాధానం కాదు. ఏ సమస్య ఉన్నా తల్లిదండ్రులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.