iDreamPost
android-app
ios-app

కొంప ముంచిన యూట్యూబ్ వీడియో.. వైన్ తయారు చేసిన బాలుడు.. తాగిన ఫ్రెండ్ కు ఏమైందంటే?

కొంప ముంచిన యూట్యూబ్ వీడియో.. వైన్ తయారు చేసిన బాలుడు.. తాగిన ఫ్రెండ్ కు ఏమైందంటే?

ఇటీవలి కాలంలో DYI విధానం బాగా పాపులర్ అవుతోంది. ఏదైనా సొంతంగా తయారుచేయడం, సొంతగా సృష్టించడం, సృజన చేయడంపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలోనూ ట్యూటోరియల్స్, లెర్నింగ్ వీడియోస్ సంఖ్య సైతం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు అలాంటి వీడియోనే ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.

కేరళలోని తిరువనంతపురంలో జరగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఒక మైనర్ బాలుడు యూట్యూబ్ లో చూసి వైన్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. ఆ వీడియోలో చూపించినట్లుగా తయారు చేయాలని పూనుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆ తయారు చేసిన వైన్ ను అతని స్నేహితులకు ఇచ్చాడు. అది తాగిన కొద్ది సేపట్లోనే అందులోని ఒక బాలుడికి అస్వస్థగా అనిపించింది. వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు.

అయితే ఆసుపత్రిలో చేరిన బాలుడికి ప్రమాదం తప్పింది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. కానీ, ఈ ఘటన పోలీసుల వరకు వెళ్ళడంతో వారు కేసు నమోదు చేశారు. ఆ వైన్ తయారు చేసిన బాలుడిని ప్రశ్నించగా.. తన అమ్మానాన్న కొని తెచ్చిన ద్రాక్ష పళ్ళతోనే ఈ వైన్ ను తయారు చేశానని. అచ్చంగా ఆ యూట్యూబ్ వీడియోలో ఉన్నట్లుగానే తయారు చేసి కొద్ది సమయం పాటు భూమిలో పాతిపెట్టినట్లుగా పేర్కొన్నాడు. తయారీ విధానంలో ఎలాంటి రసాయనాలు వాడలేదని వివరించాడు.

స్థానిక కోర్టు వారి అనుమతితో ఆ వైన్ బాటిల్ ను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిచారు పోలీసులు. ఇందులో ఏమైనా రసాయనాలు కలిసాయని తెలిస్తే, జువెనల్ చట్టం ప్రకారం ఆ బాలుడిపై కేసు నమోద చేస్తారని తెలుస్తోంది.

సోషల్ మీడియాను మన పిల్లలు ఎలా వాడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. అసలు మన ఇంట్లో పిల్లలు ఏం చూస్తున్నారు అనే అంశంపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచడం శ్రేయస్కరం. లేదంటా ఇలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది.