మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి.. అడ్డగోలు విమర్శలు, ఆరోపణలు చేసే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు డ్రగ్స్ వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు. ఇటీవల గుజరాత్లోని ముంద్రా పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఉదంతంపై టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ముడిపెడుతూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ అనుకూల మీడియాగా భావిస్తున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు కూడా ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా […]
మొన్నామధ్య బాలకృష్ణ ఓ యువకుడి చెంప ఛెళ్లు మనిపిస్తే.. అది ఆయన నైజం అనుకున్నారు.. శాంతమూర్తి గా పేరొందిన అశోక్ గజపతి ఓ మహిళా కార్యకర్తను కొడితే.. ఆయన్ను బాలయ్య ఆవహించాడన్నారు.. తాజాగా జె.సి.ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డారు…వరుసగా జరుగుతున్న ఘటనలను, సొంత పార్టీవారినే కొడుతున్న తీరు చూస్తుంటే.. టీడీపీ నేతలకు బాలయ్య ఆవహించడం కాదు. నిలువెల్లా అసహనం ఆవహించిందనిపిస్తోంది. యథా రాజా తథా ప్రజ.. అన్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు లో […]
వైసీపీ నేతల ఆరోపణలు నిజమవుతున్నాయి.. అనుమానాలు బలపడుతున్నాయి.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం, కోదండరామస్వామి అలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది. మహిళలకు ఇళ్ల పట్టాలిస్తూ ముఖ్యమంత్రి జగన్ అనితర సాధ్యమైన రీతిలో ముందుకెళుతుండటంతో విజయనగరంలోని ఆయన బహిరంగ సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే మొదట దీనికి తెగబడినట్లు తెలియవస్తోంది. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు… 20 మందికిపైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో టీడీపీ కుట్ర […]
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు.. ప్రజల నుంచి చీవాట్లు తింటావేమోనన్న భయంతో ఉంటారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల చేత చీవాట్లు తింటావేమోనన్న ఆందోళనతో ప్రస్తుతం ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం. వచ్చే నెల 25వ తేదీన రాష్ట్రంలో కోర్టు సేలు ఉన్న భూములు మినహా మిగతా ప్రాంతాలలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి […]
ఎవరైనా ఒక నాయకుడు అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాడు అంటే అందుకు వెనుక అనేక మంది కృషి ఉంటుంది. నాయకుడి స్థాయి పెరిగే కొద్దీ సపోర్టర్స్ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. నిస్వార్ధంగా ఈ విధంగా తోడ్పడిన వారు అనేక మంది ఉంటుంటారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో ఈ తరహా ‘కట్టప్ప’లు ఎక్కువగానే కన్పిస్తుంటారు. అయితే రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో కొందరు కట్టప్పలు (వెన్నుపోటు పొడవకపోయినా) సైలెంటుగా తమదారి తాము చూసుకుంటారు. అటువంటి సమయంలోనే నాయకుడి అసలు […]
చూస్తుండగానే చేతిలో ఉన్నది చేజారిపోతుంటే జీర్ణించుకోవడం కష్టమే. ప్రస్తుతం టీడీపీ నేతల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం నుంచి 2014 ఎన్నికల వరకూ ఆంధ్రప్రదేశ్లో బీసీలు మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన హయంలో బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేశారు. ఆ సామాజికవర్గ ప్రజలకు చేతనైన మేలు చేశారు. నాడు ఎన్టీరామారావు వేసిన పునాదులపై టీడీపీ బండిని నడిపిన చంద్రబాబునాయుడు 2014 […]
బావా.. బావా.. సీయం జగన్ ఢిల్లీ వెళ్ళొచ్చాక చంద్రబాబునాయుడు మీడియాలో కన్పించడానికి బాగా గ్యాప్ వచ్చినట్టుందేంటి బావా.. అంటూ మొదలెట్టాడు మణి. అదేంట్రా బాబూ.. నిన్నగాక మొన్నే కదా అమరావతి పోరాటం అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసాడు అంటూ మణిగాడి మాటలకు అడ్డొచ్చాడు కిట్టయ్య. అది కాదు బావా రోజువిడిచి రోజు ఏదో ఒక అంశం పట్టుకుని జూమ్లోకో, ట్విట్టర్లోకో, ఇంకాస్త ముదిరితే సొంత మీడియా లోకో వచ్చేస్తుండేవారు కదా.. ఈ మధ్యన ఆ స్పీడ్ […]