iDreamPost
android-app
ios-app

మీరు అవినీతి చేసి జైలుకి వెళ్తే.. Jr. NTR ఎందుకు స్పందించాలి?: ఫ్యాన్స్

  • Author Soma Sekhar Published - 05:12 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Published - 05:12 PM, Mon - 11 September 23
మీరు అవినీతి చేసి జైలుకి వెళ్తే.. Jr. NTR ఎందుకు స్పందించాలి?: ఫ్యాన్స్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం ఏదైనా ఉంటే అది.. చంద్రబాబు అరెస్ట్ అనే చెప్పాలి. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో రూ. 371 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లుగా ఏపీ సీఐడీ ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టు బాబుకు 14 రోజుల రిమాండ్ ను కూడా విధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నాడు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ టీడీపీ నాయకులు దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తూ.. మీరు అవినీతి చేసి జైలుకు వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని, కొంతమంది టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే కొద్దిగకూడా సానుభూతి లేదా? అంటూ వారు మాట్లాడుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అవినీతి చేసి జైలుకు వెళ్తే.. యంగ్ టైగర్ ఎందుకు స్పందించాలి, అదీకాక గతంలో ఎన్నికల ప్రచారంలో వాడుకుని ఎన్టీఆర్ ను ఏవిధంగా పక్కన పెట్టారో మేం మర్చిపోలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మీరు ఏవిధంగా ఎన్టీఆర్ ను ట్రీట్ చేశారో.. మేం చూస్తూనే ఉన్నాం, అలాంటప్పుడు మా హీరో ఈ వ్యవహారంలో ఎందుకు స్పందించాలి? అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. అవినీతి చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన బాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు సపోర్ట్ చేయాలి? అంటూ సోషల్ మీడియా వేదిగా టీడీపీ నాయకులను ఓ ఆటాడుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ఈ మెుత్తం వ్యవహారంలో యంగ్ టైగర్ కు ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. మరి బాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి? అన్న ఫ్యాన్స్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet