ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన మహేష్ బాబు 28 సెట్స్ పై ఉండగానే సంచలనాలు నమోదు చేస్తోంది. దీని ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సంక్రాంతి పండగ సందర్భంగా సదరు సంస్థే అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఎంత మొత్తమనేది బయటికి చెప్పలేదు. లేటెస్ట్ గా వచ్చిన లీక్ ప్రకారం అది 80 కోట్ల ఉందట. మాములుగా ఇది చాలా పెద్ద మొత్తం. ఎలా అంటే క్యాస్టింగ్ […]
ఇటీవలే వచ్చిన ధమాకా సక్సెస్ శ్రీలీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందులో మాస్ మహారాజా ఎనర్జీకి ధీటుగా ఆమె చేసిన డాన్స్, ఒలకబోసి గ్లామర్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. నిన్నా మొన్నటి దాకా రష్మిక మందన్న, పూజా హెగ్డే అంటూ రెండు మూడు ఆప్షన్ల చుట్టే తిరుగుతున్న టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు శ్రీలీలను టాప్ 3 ప్రాధాన్యంలో పెట్టేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలిసింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో […]
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో మొదటిది పూజా హెగ్డే. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుని ఇదే రోజు అంటే డిసెంబర్ 24తో ముకుందతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బుట్టబొమ్మ తర్వాత వరస హిట్లతో దూసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల మొదటి ప్రాధాన్యత తనే ఉంటోంది. గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్టు అంతకు ముందు సంవత్సరం అల వైకుంఠపురములోతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ […]
సూపర్ స్టార్ కృష్ణ గారి అకాల మరణంతో మళ్ళీ షూటింగ్ వాయిదా పడ్డ మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ ప్రాజెక్టులో పలు మార్పులు జరిగినట్టు సమాచారం. ముందు రాసుకున్న యాక్షన్ ఎంటర్ టైనర్ స్థానంలో ఇప్పుడు ఫ్యామిలీ కం ఎమోషన్స్ తో వినోదాత్మక చిత్రాన్ని ప్లాన్ చేశారట. తక్కువ టైంలోనూ మంచి స్క్రిప్ట్ సిద్ధమయ్యింది వినికిడి. ఏ జానర్ లో సాగుతుందనే క్లారిటీ ఇంకా బయటికి రాలేదు కానీ మొత్తానికి చాలా ఆకర్షణలు సిద్ధమవుతున్నాయి. సంగీత […]
అంతా పూర్తయిపోయింది. ఒక మహాశకానికి సెలవు ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణగారికి యావత్ ప్రపంచం తుది వీడ్కోలు పలికింది. మహేష్ బాబు మానసిక స్థితి, తన ఆలోచనల గురించి తలుచుకుని అభిమానులు కలవరపడుతున్నారు. ఒకే ఏడాదిలో అన్నయ్య, తల్లి, తండ్రిని కోల్పోవడం కన్నా పెద్ద విషాదం ఎవరికైనా ఇంకేముంటుంది. అందులోనూ తాను ప్రాణంగా ప్రేమించే వాళ్లంతా ఇలా దూరమైతే తట్టుకోవడం సులభం కాదు. నిన్నా మొన్నటి దాక కుటుంబ బాధ్యతను మోసిన వాళ్ళు లేకపోవడంతో ఇక మొత్తం […]
అతడు, ఖలేజా తర్వాత దశాబ్దానికి పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు చేస్తున్న సినిమా మీద షూటింగ్ స్టార్ట్ కాక ముందు నుంచే ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. అల వైకుంఠపురములో తర్వాత ఏకంగా రెండేళ్లకి పైగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన మాటల మాంత్రికుడు ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు లేకుండా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతాడనే టాక్ ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సర్కారు వారి […]
టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మొదటగా వినిపించే పేరు తమన్. ఎప్పుడో 2008లో పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. నెంబర్ వన్ గా చక్రం తిప్పుతున్న మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళను దాటి మరీ దూసుకుపోవడం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి హీరోతో తనకు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే 2020 అల వైకుంఠపురములో తర్వాత తమన్ లో మునుపటి మేజిక్ […]
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహేష్ బాబు 28వ సినిమా నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా మొదలయ్యింది. ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ ని చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో పెద్ద సక్సెస్ కాకపోవడంతో వాళ్ళ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. అనిల్ రావిపూడి, పరశురామ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ మహేష్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డారు. ఇప్పుడు అనుభవజ్ఞుడైన త్రివిక్రమ్ […]
బాలీవుడ్ లో అవకాశాలొచ్చాయి. అయినా కాదనుకున్నా అని మహేష్ బాబు ఇంతకుముందు స్టేట్ మెంట్స్ ఇచ్చినా, ఇప్పుడు తన రాబోయే చిత్రంతో మహేష్ బాబు హిందీ మార్కెట్లోకి ఎంటర్ కావడానికి రెడీ అవుతున్నారు. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లా బాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టాలన్నది మహేశ్ బాబు స్ట్రాటజీ. అందుకే సర్కారు వారి పాటను హిందీలో డబ్ చేసి, విడుదల చేయలేదు. మహేష్ బాబు కొన్నివారాల క్రితం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ‘బాలీవుడ్ నన్ను భరించలేదు’ అన్న […]