iDreamPost
iDreamPost
అతడు, ఖలేజా తర్వాత దశాబ్దానికి పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు చేస్తున్న సినిమా మీద షూటింగ్ స్టార్ట్ కాక ముందు నుంచే ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. అల వైకుంఠపురములో తర్వాత ఏకంగా రెండేళ్లకి పైగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన మాటల మాంత్రికుడు ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు లేకుండా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతాడనే టాక్ ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సర్కారు వారి పాటతో అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిన తమన్ ఈసారి పక్కా మాస్ ఆల్బమ్ తో అలరించే అవకాశాలున్నాయి. పైగా తనకిష్టమైన సితార బ్యానర్ కావడంతో ఖచ్చితంగా బెటర్ అవుట్ పుట్టే ఇస్తాడు.
ఇటీవలే దీని షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలయ్యింది. కెజిఎఫ్ విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ కు పని చేసిన అంబు అరివులను ప్రత్యేకంగా ఈ మూవీ కోసమే భారీ రెమ్యునరేషన్ తో మాట్లాడుకున్నారు. మనకు రామ్ లక్షణ్ లు ఎలాగూ వీళ్లూ అలా కవలలు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మీద అత్యథిక పారితోషికం తీసుకుంటున్నది కూడా వీళ్లేనని టాక్. యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తుండగా ఈ ఫైట్ మాస్టర్స్ పనితనం మహేష్ కు అంతగా నచ్చలేదట. రషెస్ చూసుకున్నాక తాను ఫీలయ్యింది నిజమేనని భావించి వాళ్ళు వద్దని చెప్పేశాడట. దీంతో అంబు అరువు అక్కడి నుంచి సెలవు తీసుకోగా ప్రస్తుతం వేరొకరిని సెట్ చేసే దాకా బ్రేక్ ఇచ్చేశారు
ఇదంతా అధికారికంగా చెప్పింది కాకపోయినా సెట్ నుంచి లీకైన సోర్స్ నుంచి అందిన సమాచారం మేరకు తిరిగి షూట్ ని దసరా తర్వాత రీ స్టార్ట్ చేయబోతున్నారు. అయినా అంత పెద్ద గ్రాండియర్లకు పని చేసిన ఆ బ్రదర్స్ కు తమిళం కన్నడలో రాని సమస్య తెలుగులో ఎందుకు వచ్చిందో. కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. 2023 ఏప్రిల్ 28 విడుదల తేదీ లాక్ చేసుకున్నారు కాబట్టి దీన్ని మరీ ఆలస్యం చేయడానికి లేదు. టైం ప్రకారం షెడ్యూల్స్ ని పూర్తి చేయాల్సిందే. ఇంకా మెయిన్ క్యాస్టింగ్ జాయిన్ కావాల్సి ఉంది. ఏడు నెలల సమయం ఉందన్న మాటే కానీ ఇప్పుడున్న ఉరుకుల పరుగుల ట్రెండ్ లో కాలం ఇట్టే కరిగిపోతోంది