iDreamPost
android-app
ios-app

శ్రీలీల చేతిలో క్రేజీ ఆఫర్లు

  • Published Jan 10, 2023 | 6:55 PM Updated Updated Jan 10, 2023 | 6:55 PM
  • Published Jan 10, 2023 | 6:55 PMUpdated Jan 10, 2023 | 6:55 PM
శ్రీలీల చేతిలో క్రేజీ ఆఫర్లు

ఇటీవలే వచ్చిన ధమాకా సక్సెస్ శ్రీలీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందులో మాస్ మహారాజా ఎనర్జీకి ధీటుగా ఆమె చేసిన డాన్స్, ఒలకబోసి గ్లామర్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. నిన్నా మొన్నటి దాకా రష్మిక మందన్న, పూజా హెగ్డే అంటూ రెండు మూడు ఆప్షన్ల చుట్టే తిరుగుతున్న టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు శ్రీలీలను టాప్ 3 ప్రాధాన్యంలో పెట్టేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలిసింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీలో తనను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడా విషయంలో పునరాలోచనలో పడ్డట్టుగా ఆల్రెడీ లీక్ వచ్చింది. అవునో కాదో కన్ఫర్మ్ కావాలి

అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబోలో రూపొందుతున్న ఎన్బికె 108లో చేస్తున్నట్టు ఆల్రెడీ తనే చెప్పేసింది. అయితే హీరోకు జోడిగా కాదు కానీ ఇంకేదో ట్విస్టు ఉన్నట్టు తెలిసింది. గాలి జనార్దన్ రెడ్డి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్న జూనియర్ లోనూ తనే కథానాయిక. ఎనర్జిటిక్ స్టార్ రామ్ బోయపాటి శీను మొదటి కలయికలో ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంటోంది. నవీన్ పోలిశెట్టి సరసన చేసిన అనగనగా ఒక రోజు చివరి దశలో ఉంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబోలో ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ లో ఫిమేల్ లీడ్ కోసం శ్రీలీల పేరే ప్రతిపాదనలో ఉందట. రవితేజ సరసన ఎస్ చెప్పి ఇప్పుడు పవర్ స్టార్ కి నో చెప్పే ఛాన్స్ ఉండదు


ఇవి కాకుండా మరికొందరు నిర్మాతలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అందం చలాకీతనం కలగలిసిన శ్రీలీల డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదు. కెరీర్ ని సరిగ్గా సెట్ చేసుకుంటే టాప్ చైర్ లో కూర్చోవడానికి అట్టే సమయం పట్టదు. పూజా హెగ్డేకు 2022లో వచ్చిన వరస డిజాస్టర్లు తన మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. మరోవైపు రష్మిక మందన్న బాలీవుడ్ లో జెండా ఎగరేయాలని చేసిన మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ కాగా మూడోది డైరెక్ట్ ఓటిటికి రెడీ అయ్యింది. సో ఈ గ్యాప్ ని వాడుకోవడానికి శ్రీలీలకి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలాగో నాలుగు హిట్లు పడ్డప్పుడే జాగ్రత్తగా అడుగులు వేయాలి

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio