iDreamPost
android-app
ios-app

మహేష్‌కి విలన్‌గా నందమూరి హీరో.. ఇక బాక్సాఫీస్ బద్దలే..

  • Published May 29, 2022 | 9:45 AM Updated Updated May 29, 2022 | 9:45 AM
  • Published May 29, 2022 | 9:45 AMUpdated May 29, 2022 | 9:45 AM
మహేష్‌కి విలన్‌గా నందమూరి హీరో.. ఇక బాక్సాఫీస్ బద్దలే..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే SSMB28 ప్రాజెక్టుని మొదలు పెట్టనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. జూన్ లేదా జులై నుంచి త్రివిక్రమ్ మహేష్ సినిమా షూటింగ్ మొదలవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలని కూడా చేసుకుంది.

ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుందని తెలిసిందే. ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో సెకండ్ హీరోయిన్ గా ఇంకొకరిని తీసుకోనున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలో విలన్ పై పలు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ప్రతినాయకుడిగా నందమూరి హీరో తారకరత్నని తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే నందమూరి తారకరత్న హీరోగా చేస్తూనే పలు సినిమాల్లో విలన్ గా కూడా మెప్పించాడు. తాజాగా మహేష్ తో తలపడనున్నాడు. దీనిపై హింట్ ఇస్తూ తన ట్విట్టర్ లో కూడా తారకరత్న SSMB28 అని ఒక ఇంజక్షన్, విలన్ సింబల్ పోస్ట్ చేశాడు. దీంతో తారకరత్న ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారని మరింత క్లారిటీ వచ్చింది. ఇక తెరపై ఒకేసారి నందమూరి, ఘట్టమనేని హీరోలు కనిపిస్తే అభిమానులు పండగా చేసుకుంటారు. ఈ వార్తతో సినిమాకి మరింత హైప్ ఏర్పడింది. మహేష్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss