iDreamPost
iDreamPost
బాలీవుడ్ లో అవకాశాలొచ్చాయి. అయినా కాదనుకున్నా అని మహేష్ బాబు ఇంతకుముందు స్టేట్ మెంట్స్ ఇచ్చినా, ఇప్పుడు తన రాబోయే చిత్రంతో మహేష్ బాబు హిందీ మార్కెట్‌లోకి ఎంటర్ కావడానికి రెడీ అవుతున్నారు. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లా బాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టాలన్నది మహేశ్ బాబు స్ట్రాటజీ. అందుకే సర్కారు వారి పాటను హిందీలో డబ్ చేసి, విడుదల చేయలేదు.
మహేష్ బాబు కొన్నివారాల క్రితం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ‘బాలీవుడ్ నన్ను భరించలేదు’ అన్న కామెంట్ తోపాటు అసలు మహేష్ బాబు స్టామినా ఎంత అన్న రేంజ్ లో ముంబై మీడియా వారంపాటు కథనాలను పబ్లిష్ చేసింది.
మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమా ప్రమోషన్ లో ఘాటుగానే అన్నారు. “నాది అహంకారం కాదు, నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. వారు నన్ను భరించలేరని నేను అనుకొంటున్నా. అందుకే నేను నా టైంను వేస్ట్ చేయదలచుకోలేదు. టాలీవుడ్ లో నాకున్న స్టార్‌డమ్, ప్రేమతో, మరో పరిశ్రమకు వెళ్లాలని అనుకోలేదు. నేను ఎప్పుడూ ఇక్కడే సినిమాలు చేస్తానని అనుకొంటున్నా. ఆ సినిమాలు ఎలాగూ భారీగా తయారవుతాయి. నా నమ్మకం ఇప్పుడు నిజం అవుతోంది.” అని అన్నారు. కాని, ఎస్ఎస్ రాజమౌళి సినిమాతో మహేష్ బాబు హిందీలోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఆయన తొలిపాన్ ఇండియన్ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేశారా? లేదంటే ఆయన అభిప్రాయాన్ని మార్చుకున్నారా?
హిందీ మార్కెట్ లో ఎంటర్ కావడానికి SS రాజమౌళినే మహేష్ బాబు నన్నుకున్నారు. ఆయన స్టార్ డమ్ ను, పాన్ ఇండియన్ లెవెల్ కి తీసుకెళ్లే సత్తా మిగిలినవాళ్లెవరికీ ఉండదన్నది ఆయన భావిస్తున్నారా? ఈ డౌట్ ముంబై మీడియాకొచ్చింది. సర్కార్ వారి పాటను హిందీలో డబ్ చేసి విడుదల చేయలేదు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమానికూడా హిందీలోకి డబ్బింగ్ చేయరు.
మహేష్ బాబు సర్కారు వారి పాట, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది, డివైడ్ టాక్, నెగిటీవ్ రివ్వ్యూలతో బ్రేక్ ఈవెన్ కూడా చేరలేదని, నిర్మాతలకు కాస్త నష్టాన్నే మిగిల్చిందని ట్రేడ్ అంటోంది. రాజమౌళీతో పాన్ ఇండియన్ సినిమాకు ముందు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేశ్ బాబు తెలుగు సినిమా చేస్తున్నారు.