శిఖరమంత ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతో చేస్తున్నప్పుడూ ఏదీ తేలికగా తీసుకోకూడదు. వాళ్లకు ఇమేజ్ ఉంది కదా ఫ్యాన్స్ చూస్తారు కదాని కమర్షియల్ లెక్కలకు అతీతంగా ఏదైనా చేస్తే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పి కొడతారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. 2005. దర్శకుడు శీను వైట్లకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చేసింది. ‘ఆనందం’ సూపర్ హిట్ తర్వాత సొంతం, ఆనందమానందమాయేలు ఫ్లాప్ అయినా రవితేజ ‘వెంకీ’ని డీల్ చేసిన తీరు అందరు హీరోలను ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులో ఎంటర్ […]
ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో ఓ పదేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లో షో వేస్తే హౌస్ ఫుల్ కావడం ఊహించగలమా. కానీ దూకుడు క్రేజ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. టీవీ ఛానల్స్ లో వందల సార్లు ప్రసారమై, ఓటిటి, యుట్యూబ్ కి ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ మూవీ మీద అభిమానులు ఇంతగా ప్రేమ పెంచుకున్నారంటే దూకుడు చూపించిన సత్తా ఏమిటో అర్థమవుతుంది. దీని విశేషాలు చూద్దాం. 2008లో దర్శకుడు […]
ఒకప్పుడు థియేటర్లలో పాత సినిమాలను ఆడించడం సాధారణం. సెకండ్ థర్డ్ రిలీజ్ అంటూ బ్లాక్ బస్టర్లు చాలాసార్లు ప్రేక్షకులను పలకరించేవి. వసూళ్లు కూడా ఘనంగా వచ్చేవి. అప్పుడు ఇంటర్ నెట్లు యుట్యూబ్ లు లేవు కాబట్టి అలా నడిచింది. కానీ టెక్నాలజీ దెబ్బకు ఇదంతా గత వైభవంగా మారిపోయింది. కొత్త సినిమాలే పట్టుమని వారం పదిరోజులు గట్టిగా ఆడితే అదృష్టమనుకునే పరిస్థితులు వచ్చాయి. టాక్ బాగుంటే రెండు మూడు వారాలు. తేడా కొట్టిందో ఎల్లుండికే దుకాణం బంద్. […]