iDreamPost
android-app
ios-app

Viswam Teaser: గోపీచంద్ ‘విశ్వం’ టీజర్.. వింటేజ్ శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్! హిట్ కళ ఉట్టిపడుతోంది..

  • Published Sep 03, 2024 | 5:12 PM Updated Updated Sep 03, 2024 | 5:13 PM

Gopichand, Srinu Vaitla, Viswam Movie Teaser: మ్యాచో స్టార్ గోపీచంద్-శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న మూవీ విశ్వం. ఈ మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో వింటేజ్ శ్రీను వైట్ల కంబ్యాక్ ఇవ్వడంతో పాటుగా సినిమాకు హిట్ కళ ఉట్టిపడుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Gopichand, Srinu Vaitla, Viswam Movie Teaser: మ్యాచో స్టార్ గోపీచంద్-శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న మూవీ విశ్వం. ఈ మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో వింటేజ్ శ్రీను వైట్ల కంబ్యాక్ ఇవ్వడంతో పాటుగా సినిమాకు హిట్ కళ ఉట్టిపడుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Sep 03, 2024 | 5:12 PMUpdated Sep 03, 2024 | 5:13 PM
Viswam Teaser: గోపీచంద్ ‘విశ్వం’ టీజర్.. వింటేజ్ శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్! హిట్ కళ ఉట్టిపడుతోంది..

‘విశ్వం’.. మ్యాచో స్టార్ గోపీచంద్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. లాంగ్ గ్యాప్ తర్వాత స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల నుంచి వస్తున్న చిత్రం కావడంతో పాటుగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ మూవీతో వింటేజ్ శ్రీను కంబాక్ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా విడుదలై టీజర్ ఉంది. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ టీజర్ ను మేకర్స్ కట్ చేశారు. నవ్వులు పూయించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ శ్రీను వైట్ల లాంగ్ గ్యాప్ తర్వాత ‘విశ్వం’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. మ్యాచో స్టార్ గోపీచంద్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. డబుల్ ఇస్మార్ట్ భామ కావ్యథాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మోడ్ లో కట్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా.. నాకు గీతా ఆర్ట్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు’’ లాంటి పంచులు బాగా పేలాయి. దాంతో వింటేజ్ శ్రీను వైట్ల ఈజ్ కమ్ బ్యాక్ అంటూ ఈ టీజర్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాన్నను ఎవరైనా తిడితే వాళ్ళ తాటతీసే పాత్రలో గోపీచంద్ ఆకట్టుకున్నాడు. గోపీచంద్ ఎప్పటిలాగే యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. అయితే.. టీజర్ లో కథను ఎక్కడా కూడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్.

Viswam Teaser

ఇక శ్రీను వైట్ల నుంచి ఎలాంటి కామెడీ చూడాలని అనుకుంటున్నారో.. అచ్చం అలాంటి కామెడీనే ఈ మూవీలో చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది. అయితే తన గత మూవీలో లాగే కామెడీ ఉన్నప్పటికీ.. విశ్వంలో మాత్రం కాస్త యాక్షన్ సీక్వెన్స్ డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. ఇందులో కూడా వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ సీన్ మాదిరే ఓ ట్రాక్ ఉన్నట్లు సీన్లు చూస్తేనే తెలిసిపోతోంది. దాంతో ప్రేక్షకుల్లో  ఎప్పుడెప్పుడు ఈ మూవీ చూద్దామా అన్న క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. టీజర్ చూసిన వాళ్లందరు గోపీచంద్, శ్రీను వైట్లకు హిట్ ఖాయమని చెబుతున్నారు. విశ్వం సినిమాకు హిట్ కళ ఉట్టిపడుతోంది అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. మరి ఈ టీజర్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss