iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబినేషన్! శ్రీను వైట్లతో గోపీచంద్ కొత్త సినిమా..?

  • Author ajaykrishna Updated - 03:18 PM, Sat - 12 August 23
  • Author ajaykrishna Updated - 03:18 PM, Sat - 12 August 23
క్రేజీ కాంబినేషన్! శ్రీను వైట్లతో గోపీచంద్ కొత్త సినిమా..?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. తన కెరీర్ విషయంలో స్పీడ్ పెంచేసాడు. యాక్షన్ హీరోగా ముందునుండి పేరున్న గోపీచంద్.. కొన్నాళ్ళుగా సరైన హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో ఈ ఏడాది మూడో ప్రయత్నంగా రామబాణం చేశాడు. అది కాస్త బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచేసరికి.. తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ పూర్తి స్థాయిలో మాస్ సినిమా చేసి చాలకాలం అయ్యింది. అందుకే ఈసారి ఎలాగైనా అదే మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం గోపి.. కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష దర్శకత్వంలో ‘భీమా’ సినిమా చేస్తున్నాడు.

గతేడాది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో వేద సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు హర్ష. దీంతో ఇప్పుడు గోపీచంద్ తో భీమా సినిమా చేస్తుండటంతో.. ఆల్రెడీ కాంబినేషన్ పై మోస్తరు అంచనాలైతే సెట్ అయిపోయాయి. అందులోనూ ఈ సినిమాలో గోపీచంద్ మేకోవర్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా.. భీమా మూవీలో గోపి.. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఆల్రెడీ సినిమా కోసం గోపి లుక్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. గోపి తదుపరి సినిమా క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ప్రెజెంట్ ప్లాప్ లలో ఉన్న డైరెక్టర్ శ్రీను వైట్లతో ఓకే అయినట్లు సినీ వర్గాల సమాచారం.

టాలీవుడ్ లో శ్రీను వైట్ల సినిమాలకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కామెడీ ఎంటర్టైనర్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే.. మహేష్ బాబుతో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎన్టీఆర్ తో బాద్షా చేసి పర్వాలేదనిపించాడు. కానీ.. ఆ తర్వాత చేసిన ఆగడు, మిస్టర్, బ్రూస్ లీ, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. దీంతో భారీ గ్యాప్ తీసుకొని తనకు బాగా కలిసి వచ్చిన కామిక్ జానర్ లో మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడని సమాచారం. ఆ స్క్రిప్ట్ ని గోపీచంద్ తో లాక్ చేసుకొని.. విశ్వమ్ అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే.. వీరి కాంబోకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి గోపీచంద్ – శ్రీను వైట్ల కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet