iDreamPost
android-app
ios-app

The Journey of Viswam: ‘విశ్వం’ హిట్ కోసం శ్రీను వైట్ల వింటేజ్ ప్లాన్! వెంకీ ట్రైన్ సీన్స్ తో!

  • Published Jul 31, 2024 | 2:59 PM Updated Updated Jul 31, 2024 | 2:59 PM

లాంగ్ గ్యాప్ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో 'విశ్వం' అనే మూవీ చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను 'ది జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకర్స్ విడుదల చేశారు.

లాంగ్ గ్యాప్ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో 'విశ్వం' అనే మూవీ చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను 'ది జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకర్స్ విడుదల చేశారు.

  • Published Jul 31, 2024 | 2:59 PMUpdated Jul 31, 2024 | 2:59 PM
The Journey of Viswam: ‘విశ్వం’ హిట్ కోసం శ్రీను వైట్ల వింటేజ్ ప్లాన్! వెంకీ ట్రైన్ సీన్స్ తో!

శ్రీను వైట్ల.. వెంకీ, ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక కామెడీ ట్రేడ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్. శ్రీను వైట్ల సినిమా వస్తుందంటే చాలు.. అందులో కామెడీకి కొదవ ఉండదు అన్నది నిజం. అయితే గత కొంత కాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరించడం లేదు. దాంతో దాదాపుగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడా? అన్న సందేహాలు కూడా కలిగాయి. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో ‘విశ్వం’ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను ‘ది జర్నీ ఆఫ్ విశ్వం’ పేరుతో మేకర్స్ విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘విశ్వం’.. శ్రీను వైట్ల-గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కున్న కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను ‘ది జర్నీ ఆఫ్ విశ్వం’ పేరుతో విడుదల చేశారు. ఇక ఈ వీడియో చూస్తుంటే.. దర్శకుడు శ్రీను వైట్ల తన పంథాను పూర్తిగా మార్చినట్లు కనిపిస్తున్నాడు. అద్భుతమైన ఫారిన్ లోకేషన్లలో యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించినట్లు అర్దమవుతోంది. ఇక ఈ సినిమాలో తన మార్క్ కామెడీగా ఉంది. అదికూడా తనకు అచ్చొచ్చిన ట్రైన్ సీక్వెన్స్. అవును రవితేజ ‘వెంకీ’ మూవీలో ట్రైన్ సీన్లు ఏ రేంజ్ లో నవ్వులు పూయించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి సీన్లే టీటీఈతో విశ్వంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మరోసారి తనకు అచ్చొచ్చిన వింటేజ్ ట్రైన్ కామెడీనే నమ్ముకున్నట్లున్నాడు శ్రీను వైట్ల. ఇక ఇందులో భారీ యాక్షన్ స్వీకెన్స్ లు ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో చిత్రీకరించిన ఈ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి జర్నీ ఆఫ్ విశ్వం మూవీ స్పెషల్ వీడియో ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş