iDreamPost
android-app
ios-app

గోపీచంద్ ఎమోషనల్ పోస్ట్! ప్రత్యేక కారణమే ఉంది..

  • Published Aug 03, 2024 | 5:57 PM Updated Updated Aug 03, 2024 | 5:57 PM

Gopichand Emotional Post: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ పోస్ట్ చేయడానికి ప్రత్యేక కారణమే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

Gopichand Emotional Post: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ పోస్ట్ చేయడానికి ప్రత్యేక కారణమే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 03, 2024 | 5:57 PMUpdated Aug 03, 2024 | 5:57 PM
గోపీచంద్ ఎమోషనల్ పోస్ట్! ప్రత్యేక కారణమే ఉంది..

గోపీచంద్.. ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినప్పటికీ, విలన్ గా కూడా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. నితిన్ ‘జయం’ మూవీలో గోపీచంద్ ఏ రేంజ్ లో విలనిజం చూపించాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించాడు ఈ మ్యాచో స్టార్. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘విశ్వం’ అనే మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు ఈ స్టార్ హీరో. ఆ పోస్ట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉందండోయ్. అదేంటంటే?

2001లో వచ్చిన ‘తొలి వలపు’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మ్యాచో స్టార్ గోపీచంద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. యజ్ఞం, లక్ష్యం, లౌక్యం, రణం, శౌర్యం, గోలీమార్ ఇలా విజయవంతమైన చిత్రాలు ఎన్నో తన కెరీర్ లో చేశాడు. అయితే గోపీచంద్ ఇండస్ట్రీలోకి వచ్చి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. అందులో మ్యాచో స్టార్ ఈ విధంగా రాసుకొచ్చాడు.

“నా 23 ఏళ్ల సినీ కెరీర్ లో నాకు సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నా కో స్టార్స్, డైరెక్టర్స్, నిర్మాతల సహకారం మరిచిపోలేనిది. ఇక అభిమానుల ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు ఇక్కడున్నాను. మీరే నా బలం. మీ రుణం తీర్చుకోలేనిది. నా కెరీర్ లో మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేనిది. ఇలాగే మీ మద్ధతు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం మూవీతో మళ్లీ కలుద్దాం” అంటూ ట్వీట్ చేశాడు గోపీచంద్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ది జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ట్రైన్ కామెడీ సీన్స్ మరోసారి వింటేజ్ శ్రీను వైట్లను గుర్తుచేశాయి. మరి సినీ ఇండస్ట్రీలో గోపీచంద్ 23 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetvbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş