iDreamPost
android-app
ios-app

గ్రాండ్ గా మొదలైన గోపీచంద్ – శ్రీనువైట్ల కొత్త సినిమా!

  • Author ajaykrishna Published - 03:01 PM, Sat - 9 September 23
  • Author ajaykrishna Published - 03:01 PM, Sat - 9 September 23
గ్రాండ్ గా మొదలైన గోపీచంద్ – శ్రీనువైట్ల కొత్త సినిమా!

ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్.. కొన్నాళ్ళుగా అసలు కనిపించడం లేదు, కనీసం ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఇక ఆయన మళ్లీ వచ్చే ఆలోచనలో ఉన్నాడో లేదో.. వరుస ప్లాప్స్ పడితే ఎవరేం చేస్తారు.. రాకపోవచ్చు! అనే కామెంట్స్ ఇన్నాళ్లు వింటూ వచ్చాము. ఆయన ఎందుకు గ్యాప్ తీసుకున్నారో తెలియదు. కానీ.. ఈసారి ఊహించని కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్ చేయడమే కాదు.. ఏకంగా లాంచ్ కూడా చేసేశాడు. ఆ దర్శకుడు ఎవరో తెలుసు కదా! మెగాస్టార్ ని సైతం డ్యూయెల్ రోల్ లో చూపించి మెప్పించగలిగాడు. రవితేజకు కెరీర్ లో మర్చిపోలేని సినిమాలు అందించాడు.

మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా ట్రెండ్ కి తగ్గట్టుగా తన కామెడీ ఫార్ములా జోడించి సినిమాలు తీసి ఆల్ టైమ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు దర్శకుడు శ్రీను వైట్ల. ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ తర్వాత తరంలో అంతటి కామెడీ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన ఘనత శ్రీను వైట్లకే దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే.. సొంతం, ఆనందం, వెంకీ, దుబాయ్ శీను, అందరివాడు, దూకుడు, కింగ్, రెడీ, ఢీ, బాద్షా, నమో వేంకటేశ.. ఇలా ప్రతీ హీరోకు బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ని ఇస్తూ వచ్చారు. కానీ.. ఆగడు తర్వాత వరుసగా నిరాశపరిచారు. బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు శ్రీను వైట్లను సంధిగ్ధంలో పడేసాయి.

కట్ చేస్తే.. ఐదేళ్లు గ్యాప్ తీసుకొని టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తో కొత్త సినిమా పట్టాలెక్కించారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మూవీ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లో 32వ సినిమా కాబోతుంది. ఈ సినిమాతో టాలీవుడ్ కి కొత్త నిర్మాణ సంస్థ పరిచయం అవుతోంది. చిత్రాలయం ప్రొడక్షన్ హౌస్.. సంస్థ మొదటి సినిమాగా గోపీచంద్, శ్రీను వైట్ల మూవీ మొదలైంది. ప్రస్తుతం గోపీచంద్, డైరెక్టర్ శ్రీను ఇద్దరు కూడా సాలిడ్ హిట్ కోసం కసితో ఉన్నారు. మరోవైపు శ్రీను వైట్ల గురించి ఎన్నో నెగిటివ్ కథనాలు కూడా ఇన్నాళ్లు స్ప్రెడ్ అయ్యాయి. ఈసారి ట్రోల్స్ కి షాకిస్తూ శ్రీను వైట్ల బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss